News

విప్రోకు ఉజ్వల భవిష్యత్..

Wednesday 17th July 2019
news_main1563341781.png-27115

  • కొత్త శిఖరాలు అధిగమిస్తుంది
  • డిజిటల్, క్లౌడ్‌పై భారీ పెట్టుబడులు
  • చైర్మన్‌గా చివరి ఏజీఎంలో అజీం ప్రేమ్‌జీ

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్‌ సేవలు, సైబర్‌ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు.  ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు బోర్డు, షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. 
ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్‌ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.  చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు. 
అసాధారణ ప్రయాణం...
ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్‌ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం.  ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. 
రిషద్‌ సారధ్యంలో మరింత వృద్ధిలోకి...
కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్‌ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్‌షిప్‌ టీమ్‌లో రిషద్‌ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు. 
ఎండీగా ఆబిదాలి...- కొత్త శిఖరాలు అధిగమిస్తుంది
- డిజిటల్, క్లౌడ్‌పై భారీ పెట్టుబడులు
- చైర్మన్‌గా చివరి ఏజీఎంలో అజీం ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో భవిష్యత్‌ మరింత ఉజ్వలంగా ఉండబోతోందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ చెప్పారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందని ఆయన తెలిపారు. డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్‌ సేవలు, సైబర్‌ సెక్యూరిటీ విభాగాలపై భారీగా ఇన్వెస్ట్‌ చేయనుందని మంగళవారం కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వివరించారు.  ‘సామర్ధ్యాలను పెంచుకునేందుకు విప్రో భారీగా పెట్టుబడులు పెడుతుంది. మారే ప్రపంచానికి అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, విలువలకు కట్టుబడి ఇకపైనా ప్రస్థానం కొనసాగిస్తుంది. కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విప్రో భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు బోర్డు, షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారని, సెబీ అనుమతుల మేరకు ఆగస్టునాటికి ఈ ప్రక్రియ పూర్తి కాగలదని ఆయన తెలిపారు. 
ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేయనున్న ప్రేమ్‌జీ చివరిసారిగా ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ హోదాలో ఇందులో పాల్గొన్నారు. సుమారు 53 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విప్రోకు సారథ్యం వహించిన ప్రేమ్‌జీ ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేసి, కంపెనీ పగ్గాలను కుమారుడు రిషద్‌ ప్రేమ్‌జీకి అందించనున్నారు. ప్రస్తుతం చీఫ్‌ స్ట్రాటెజీ ఆఫీసర్‌గా ఉన్న రిషద్‌ ప్రేమ్‌జీ జూలై 31న ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.  చైర్మన్‌గా ప్రేమ్‌జీకి ఆఖరు ఏజీఎం కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రిటైర్మెంట్‌ తర్వాత ఆయన విప్రో బోర్డులో నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరుగా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగనున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలపై పూర్తి సమయం వెచ్చించనున్నారు. 
అసాధారణ ప్రయాణం..
ఏజీఎం సందర్భంగా కంపెనీ ప్రస్థానాన్ని ప్రేమ్‌జీ గుర్తు చేసుకున్నారు. ఒక చిన్న పాటి వంటనూనెల సంస్థగా మొదలెట్టిన కంపెనీ.. 8.5 బిలియన్‌ డాలర్ల భారీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన తీరును ప్రస్తావించారు. ‘నా వరకూ ఇది ఒక అసాధారణ ప్రయాణం.  ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ, విప్రో తనను తాను మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. విలువలకు కట్టుబడి ఉండటం, ఉద్యోగుల నిబద్ధత, శ్రమతోనే ఇదంతా సాధ్యమైంది. ఇదే విప్రో స్ఫూర్తి‘ అని ప్రేమ్‌జీ చెప్పారు. 
రిషద్‌ సారధ్యంలో మరింత వృద్ధిలోకి..
కొత్త ఆలోచనలు, విస్తృత అనుభవం, పోటీతత్వంతో తన వారసుడైన రిషద్‌ .. విప్రోను మరింతగా వృద్ధిలోకి తేగలరని ప్రేమ్‌జీ ఆకాంక్షించారు. ‘2007 నుంచి లీడర్‌షిప్‌ టీమ్‌లో రిషద్‌ భాగంగా ఉన్నారు. కంపెనీ గురించి, వ్యాపార వ్యూహాలు, సంస్కృతి గురించి తనకు పూర్తి అవగాహన ఉంది‘ అని ఆయన చెప్పారు. 
ఎండీగా ఆబిదాలి...
ప్రస్తుతం సీఈవోగా ఉన్న ఆబిదాలి నీముచ్‌వాలా జూలై 31 నుంచి విప్రో లిమిటెడ్‌ ఎండీ బాధ్యతలు కూడా చేపట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన నారాయణన్‌ వాఘుల్, అశోక్‌ గంగూలీ విప్రో బోర్డు నుంచి పదవీ విరమణ చేయనున్నారు. నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టరుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య విప్రో బోర్డులో చేరతారు. 

You may be interested

‘నీటి’పై భారీ పెట్టుబడులు!!

Wednesday 17th July 2019

వచ్చే 15 ఏళ్లలో 18.9 లక్షల కోట్లు బ్యాంకాఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ అంచనా నీటి వినియోగం తగ్గించే విధానాలు కావాలి ప్రైవేటు పెట్టుబడులనూ ఆహ్వానించాలి అందుకు తగ్గ మోడళ్లు తయారు చేయాలని సూచన ముంబై: చెన్నై నగరం ఎదుర్కొంటున్న దారుణమైన నీటి ఎద్దడిని చూస్తూనే ఉన్నాం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా నీరు చెన్న నగరానికి చేరవేయాల్సిన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వేసవిలో దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల పరిస్థితి ఇలానే ఉంది. వర్షపు

రూపీ బలహీనం

Wednesday 17th July 2019

రూపీ డాలర్‌ మారకంలో 7 పైసలు బలహీనపడి 68.77 వద్ద బుధవారం ట్రేడవుతోంది. ఇది 68.70 వద్ద ప్రారంభమైంది. విదేశి పెట్టుబడులు బయటకు వెళ్లడం, ఆయిల్‌ ధరలు పెరగడం, మేజర్‌ కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌మారకంలో 69.76 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. దేశియ మార్కెట్లో కొనుగోలు పెరగడంతో రూపీ కొలుకొని చివరకు 17 పైసలు బలహీన పడి 68.71 వద్ద ముగిసింది.    

Most from this category