News


పరిశ్రమను మించి వృద్ధి సాధిస్తాం

Saturday 22nd June 2019
news_main1561175957.png-26484

  • మైండ్‌ట్రీ చైర్మన్ నటరాజన్‌-

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం మైండ్‌ట్రీ పూర్తి సత్తా ఇంకా చాటలేదని, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పనితీరు కనపరుస్తుందని కంపెనీ చైర్మన్ కృష్ణకుమార్ నటరాజన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కనిష్ట రెండంకెల స్థాయి వృద్ధికి పరిమితం కావొచ్చని.. అయితే అనేక అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ పరిశ్రమను మించే వృద్ధి సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మైండ్‌ట్రీలో ఎల్‌అండ్‌టీ సంస్థ అవాంఛిత రీతిలో మెజారిటీ వాటాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండటం అసాధారణ పరిస్థితని, వాటాదారులందరికీ గరిష్ట ప్రయోజనాలు చేకూర్చేలా ఈ అంశాన్ని పరిష్కరించగలమని నటరాజన్ వివరించారు. బీఎస్‌ఈకి సమర్పించిన వార్షిక నివేదికలో నటరాజన్‌, సీఈవో రోస్టో రవనన్ ఈ విషయాలు తెలిపారు. అవకాశాలు అందిపుచ్చుకోవడంపైనా, పరిశ్రమ కన్నా అధిక వృద్ధి రేటు సాధించడంపైనా కంపెనీ దృష్టి పెడుతోందని వారు పేర్కొన్నారు. మైండ్‌ట్రీని ఎల్‌అండ్‌టీ బలవంతపు టేకోవర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 30 శాతం దాకా వాటాలు పెంచుకున్న ఎల్‌అండ్‌టీ మరో 31 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇది జూన్‌ 28తో ముగియనుంది. మొత్తం మీద 66 శాతం వాటాల కొనుగోలు కోసం ఎల్‌అండ్‌టీ రూ. 10,700 కోట్లు వెచ్చిస్తోంది. కానీ ఈ బలవంతపు టేకోవర్‌ నుంచి తమ సంస్థను కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ ప్రమోటర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. You may be interested

ఈ-కామర్స్‌ @ ఎట్‌ మేడిన్ ఇండియా

Saturday 22nd June 2019

దేశీయంగా తయారీపై దృష్టి భారత్‌లో సొంత ప్రైవేట్‌ లేబుల్స్‌ ఉత్పత్తి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ దేశీ బాట భారీ దిగుమతి సుంకాల బెడద తప్పించుకునేందుకు, మేకిన్‌ ఇండియా నినాద ప్రయోజనాలను పొందేందుకు  ఈ–కామర్స్‌ దిగ్గజాలు క్రమంగా భారత్‌లో తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటిదాకా సొంత బ్రాండ్స్‌ కోసం చైనా, మలేషియాపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌ కొన్నాళ్లుగా మేడిన్‌ ఇండియా ఉత్పత్తులవైపు మొగ్గు చూపుతోంది. దీంతో తమ ప్లాట్‌ఫాంపై విక్రయించే దాదాపు 300 కేటగిరీల ఉత్పత్తుల

అరబిందోకు యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌

Saturday 22nd June 2019

ఔషధ తయారీ కంపెనీ అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఏపీఐ తయారీ కేంద్రం యూనిట్‌-11లో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించిన ఎఫ్‌డీఏ తాజాగా వార్నింగ్‌ లెటర్‌ జారీ చేసింది. ఈ ఫెసిలిటీలో ప్రస్తుతం జరుగుతున్న వ్యాపారంపై ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని అరబిందో అభిప్రాయపడింది.

Most from this category