News


సగటు గృహ,వ్యక్తిగత రుణాల్లో అగ్రస్థానంలో బెంగళూరు

Saturday 18th January 2020
news_main1579330437.png-31015

  • రెండో స్థానానికి పరిమితమైన ముంబై

న్యూఢిల్లీ: సగటున అధిక మొత్తంలో గృహ రుణాలు  పొందే నగరాల జాబితాలో ఆర్థిక రాజధాని ముంబైని వెనక్కి నెట్టి బెంగళూరు ముందువరుసలో నిలిచింది. ఐటీ హబ్‌గానే కాకుండా స్టార్టప్‌లకు రాజాధానిగా పేరుగాంచిన బెంగళూరు నగరం గృహ, వ్యక్తిగత సగటు రుణాలను దేశంలో ఇతర ప్రాంతాల కంటే అధికంగా తీసుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని బ్యాంక్‌ బజార్‌ మనీమూడ్‌-2020 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2019 సంవత్సరంలో సగటు రుణమొత్తం రూ.2.2 కోట్ల మేర బెంగళూరు అందుకుని మొదటి స్థానంలో నిలవగా, రూ.2 కోట్లతో ముంబై రెండోస్థానానికి పరిమితమైందని నివేదిక పేర్కొంది. అదేవిధంగా వ్యక్తిగత రుణాలలో కూడా అత్యధిక సగటు రుణం రూ.34 లక్షలతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం....సగటు వ్యక్తిగత సగటు రుణ  పరిమాణం బెంగళూరులో రూ.33.3 లక్షలు ఉండగా, ముంబైలో రూ.26.6 లక్షలుగా ఉంది. అయితే  అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్‌టెంట్స్‌ ప్రకారం.. బెంగళూరు సగటు రుణ పరిమాణం 2016లోకంటే 2019లో 11 శాతం పెరిగింది. ‘‘సంవత్సరాలుగా సొంత ఇంటిని నిర్మంచుకోవడానికి బెంగళూరు ప్రజలు దశాబ్దాలపాటు ఎదురు చూడకుండా, పెరుగుతున్న ఆస్తి ధరలను తట్టుకుని సొంత ఇంటికలను సాకారం చేసుకోవడానికి గృహరుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే అధిక రుణాలే కాకుండా సాధారణ రుణాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని’’ బ్యాంక్‌ బజార్‌ డాట్‌ కమ్‌ సీఎంవో  అపర్ణ మహేష్‌ చెప్పారు. 2019 అక్టోబర్‌ నుంచి వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో గృహరుణాల్లో 25 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపారు.

సగటు గృహరుణ పరిమాణంలో  టాప్‌ 5లో ఉన్న నగరాలు:
1) బెంగళూరు(రూ.2.2 కోట్లు)
2) ముంబై (రూ.2 కోట్లు)
3) అహ్మాదాబాద్‌ (రూ.1.98 కోట్లు)
4) పూనే (రూ.1.84 కోట్లు)
5) చెన్నై (రూ.1.3 కోట్లు

సగటు వ్యక్తిగత రుణ పరిమాణంలో  టాప్‌ 5లో ఉన్న నగరాలు:
1) బెంగళూరు (రూ.35 లక్షలు)
2) థార్వాడ్‌ (రూ.30 లక్షలు)
3) ఘజియాబాద్‌ (రూ.30 లక్షలు)
4) హైదరాబాద్‌ (రూ.30 లక్షలు)
5) కోల్‌కతా (రూ.26 లక్షలు) 

 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలివే..!

Saturday 18th January 2020

అంచనాలకు తగ్గట్టే ఫలితాలు ఉండొచ్చు అటో, వ్యసాయ రంగ సిప్లేజ్‌లు కీలకం అంటున్న బ్రోకరేజ్‌లు దేశీయ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకు క్యూ3 ఫలితాలను పలు బ్రోకరేజ్ సంస్థలు తమ అంచనాలను వెలువరించాయి. కార్పోరేట్‌ కంపెనీలపై పన్ను తగ్గింపు కలిసొచ్చే అవకాశంగా ఉన్నందున ఈ క్యూ3లో వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 20శాతం

మిడ్‌,స్మాల్‌ క్యాప్స్‌ నుంచి మంచి రాబడులు

Saturday 18th January 2020

రానున్న 3-4 ఏళ్లలో మధ్య, చిన్నతరహా కౌంటర్లదే జోరు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ అంచనా రెండేళ్ల క్రితం స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ చివరి దశకు చేరుకున్నదని ప్రకటించడం ద్వారా కచ్చితమైన అంచనాలు ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ తాజాగా.. యూటర్న్‌ తీసుకున్నారు. ఇకపై మళ్లీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అత్యధిక రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక అంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా

Most from this category