News


మార్కెట్లోకి ‘బెనెల్లి ఇంపీరియల్ 400

Wednesday 23rd October 2019
news_main1571803819.png-29068

- ధర రూ. 1.69 లక్షలు

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన సూపర్‌ బైక్స్‌ తయారీ సంస్థ ‘బెనెల్లి’.. భారత మార్కెట్లోకి తాజాగా తన క్లాసిక్‌ మోడల్‌ ‘ఇంపీరియల్ 400’ బైక్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 1.69 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా ప్రకటించింది. ఈ బైక్‌ 374సీసీ ఎయిర్‌-కూల్డ్‌ బీఎస్‌ సిక్స్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. రూ. 4,000 డౌన్‌ పేమెంట్‌తో బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల స్టాండర్డ్‌ వారంటీతో పాటు మొదటి 2 సంవత్సరాలకు కాంప్లిమెంటరీ సర్వీస్‌ను నూతన బైక్‌కు అందిస్తున్నట్లు వివరించింది. ఈ సందర్భంగా సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జాబాఖ్ మాట్లాడుతూ.. ‘నూతన బైక్‌ విడుదలతో ప్రీమియం విభాగంలో గట్టి పోటీగా నిలవాలనుకుంటున్నాం. డీలర్‌షిప్ లాంచ్‌లతో మార్కెట్ వాటాను పెంచాలని యోచిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

పెరిగిన జీఎస్‌కే ఫార్మా లాభం

Wednesday 23rd October 2019

రూ.882 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మాస్యూటికల్స్‌(జీఎస్‌కే ఫార్మా) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.503 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత క్యూ2లో రూ.101 కోట్ల నికర లాభం ఆర్జించామని జీఎస్‌కే ఫార్మా తెలిపింది. ఇక ఆదాయం రూ.816 కోట్ల నుంచి రూ.882 కోట్లకు పెరిగిందని పేర్కొంది. రూ.401 కోట్ల మినహాయింపు అంశాల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. భూ విక్రయం కారణంగా రూ.545

చాక్లెట్‌ ఖరీదు రూ. 4.3 లక్షలు

Wednesday 23rd October 2019

- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన   చాక్లెట్‌ తయారు చేసిన ఐటీసీ న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’..  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్‌ మరొకటి లేనందున గిన్నిస్‌ బుక్‌లో ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక

Most from this category