News


వొడాఐడియా... ఏ బ్యాంకుకు ఎంత బకాయి?

Friday 14th February 2020
news_main1581664480.png-31793

బ్యాంకులకు, ప్రభుత్వానికి భారీ నష్టం
శుక్రవారం టెల్కోలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌ బకాయిల గడువు పొడిగింపు కోరుతూ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్స్‌ను తోసిపుచ్చింది. ఇంతవరకు ఏజీఆర్‌ బకాయిలు ఎందుకు వసూలు చేయలేదని డీఓటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో టెలికం కంపెనీలు ముందు ఆదేశించిన విధంగా తప్పక ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏజీఆర్‌ బాకీలపై పునర్విచారణ, చెల్లింపుల సరళీకరణ జరగకపోతే కంపెనీ మూసుకుపోవడం తప్ప వేరే మార్గం లేదని మొదటి నుంచి వొడాఫోన్‌ ఐడియా చెబుతూ వస్తోంది. తాజా తీర్పుతో వొడాఫోన్‌ ఐడియా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వొడాఫోన్‌ఐడియా(వీఐఎల్‌)లాంటి బడా కంపెనీ మూతపడితే దాని ప్రభావం అటు ప్రభుత్వంపై ఇటు బ్యాంకులపై తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీ మూసివేతతో వేల కోట్ల రూపాయల రుణాలు మొండిపద్దులుగా మారతాయని, వేలమంది ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీఐఎల్‌ మూసివేత జరిగితే ప్రభుత్వం దాదాపు రూ. 90 వేల కోట్ల రూపాయలను(స్పెక్ట్రం బకాయిలు, ఏజీఆర్‌ బకాయిలు) కోల్పోతుంది. కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు తీసివేస్తే బ్యాంకులకు మరో రూ. 28వేల కోట్ల బకాయి ఉంటుంది. కంపెనీ వద్ద మిగులు రూ. 15400 కోట్లుండగా, ఈ మొత్తం తీసివేస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 13వేల కోట్లుంటాయని గోల్డ్‌మన్‌సాక్స్‌ అంచనా వేసింది. ఇది మొత్తం బ్యాంకుల ఎన్‌పీఏల్లో 2 శాతానికి సమానం. ఇంత మొత్తం మొండిపద్దు కింద మారితే బ్యాంకులు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు.

గోల్డ్‌మన్‌ సాక్స్‌ ప్రకారం వీఐఎల్‌కు అప్పులిచ్చిన బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి...
1. ఎస్‌బీఐ- రూ. 11200 కోట్లు. 2. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌- రూ. 3995 కోట్లు. 3. ఐడీఎఫ్‌సీ- రూ.2500 కోట్లు. 4. ఐసీఐసీఐ బ్యాంకు- రూ. 1725కోట్లు. 5. పీఎన్‌బీ- రూ. 1027.7 కోట్లు. సంపద పరంగా చూస్తే ఐడీఎఫ్‌సీ తన మొత్తం రుణాల్లో 11 శాతాన్ని, ఇండస్‌ఇండ్‌ 9 శాతాన్ని వీఐఎల్‌కు రుణంగా ఇచ్చాయి. 
ఇక మొత్తం టెలికం రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు చూస్తే అత్యధికంగా యస్‌బ్యాంకు రూ. 7937కోట్లు అంటే దాని సంపద విలువలో 29 శాతం టెల్కోలకు రుణంగా ఇచ్చింది. పీఎస్‌బీల్లో ఎస్‌బీఐ రూ. 36542కోట్లు అంటే దాని మొత్తం రుణవితరణలో 16 శాతం టెల్కోలకు రుణాలుగా ఇచ్చింది. ఇలాంటి తరుణంలో ఒక పెద్ద టెలికం కంపెనీ డిఫాల్టయితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. You may be interested

సంపదలో భళా.. డీమార్ట్‌ దమానీ

Friday 14th February 2020

కుబేర జాబితాలో ఐదో ర్యాంకు రూ. 1.6 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ రూ. 2560 వద్ద సరికొత్త గరిష్టానికి షేరు డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ తాజాగా సంపదలో మరో మెట్టు ఎక్కారు. ఈ వారం మొదట్లో దేశీ కుబేరుల్లో ఆరో ర్యాంకును సాధించిన రాధాకిషన్‌ ప్రస్తుతం ఐదో స్థానాన్ని ఆక్రమిస్తున్నారు. డీమార్ట్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌​ షేరు ఇటీవల ర్యాలీ బాటలో సాగుతోంది. గురువారం ఈ

బ్యాంక్‌ నిఫ్టీ 473 పాయింట్లు పతనం

Friday 14th February 2020

ఏజీఆర్ చెల్లింపుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం కంపెనీలకు ఎక్స్‌పోజర్స్‌గా ఉన్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్రనష్టాన్ని చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు ఉదయం 31,281.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  ఏజీఆర్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించి న్యూ షెడ్యూల్‌ను జారీ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ టెలికం కంపెనీలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

Most from this category