News


ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఖాతాలు ఎన్‌పీఏలే!!

Wednesday 17th April 2019
Markets_main1555479577.png-25174

ఎన్‌సీఎల్‌ఏటీకి తెలిపిన ఆర్‌బీఐ న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల ఖాతాలను నిబంధనల మేరకు ఎన్‌పీఏలుగా వర్గీకరించాల్సి ఉంటుందని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ముందు ఆర్‌బీఐ వాదించింది. రుణ చెల్లింపుల్లో విఫలమైన 90 రోజుల తర్వాత ఏ ఖాతానయినా సరే ఎన్‌పీఏగా వర్గీకరించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని స్పష్టం చేసింది. ప్రతీ బ్యాంకు ఇదే విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని, ఈ విషయంలో మినహాయింపు ఉండదని పేర్కొంది. ఈ మేరకు ఆర్‌బీఐ తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ జైన్‌ ఎన్‌సీఎల్‌ఏటీకి ముందు వాదించారు. పారదర్శకమైన, ఖాతాల వ్యవస్థ కోసమే ఇలా చేస్తున్నామని, దీనివల్ల బ్యాంకుల ఆరోగ్యంపై ప్రభావం పడదని చెప్పారాయన. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ దాని గ్రూపు కంపెనీల ఖాతాలను ఎన్‌పీఏలుగా వర్గీకరించకుండా నిరోధిస్తూ ఎన్‌సీఎల్‌ఏటీఏ గతంలో ఆదేశాలు జారీ చేయడంతో వాటిని సవరించాలని కోరుతూ ఆర్‌బీఐ తన వాదనలు వినిపించింది. ఈ కేసు విచారణను అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఈ నెల 29కి వాయిదా వేసింది.



You may be interested

నగలు జీవితంలో భాగమయ్యాయి

Wednesday 17th April 2019

- అందుకే భారత్‌లో డిమాండ్‌ కొనసాగుతుంది - ఏటా 10-15 శాతం వృద్ధి సాధిస్తున్నాం - ‘సాక్షి’తో జోయాలుక్కాస్‌ చైర్మన్‌ జోయ్‌ ఆలుక్కాస్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  ‘ఆభరణాలు ధరించడటమనేది భారతీయుల రక్తంలోనే ఉంది. అందుకే ఇవి జీవితంలో ఒక భాగమయ్యాయి. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, అక్షయ తృతీయ వంటివి వచ్చాయంటే చాలు!! ఎంతో కొంతైనా బంగారు నగలు కొనుగోలు చేస్తారు’ అని ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్‌ గ్రూప్‌ చైర్మన్‌ జోయ్‌

విమానంలో కనెక్టివిటీ కోసం జియో దరఖాస్తు

Wednesday 17th April 2019

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో విమానం లోపల కనెక్టివిటీ, డేటా సేవలందించేందుకు తమకు అనుమతివ్వాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టెలికాం విభాగానికి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఓర్టస్ కమ్యూనికేషన్స్, స్టేషన్ శాట్‌కామ్‌, క్లౌడ్ కాస్ట్ డిజిటల్ సంస్థలు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్కు (డాట్‌) ఈ సౌకర్యం కోసం దరఖాస్తులు సమర్చించాయి. ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ తప్పనిసరి చేస్తూ గతేడాది డాట్‌ నిర్ణయం తీసుకోగా.. హ్యూస్‌ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్‌)

Most from this category