News


త్వరలోనే యాడ్‌ల్యాబ్స్‌ సమస్య కొలిక్కి

Wednesday 3rd July 2019
news_main1562137045.png-26762

  • సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం ! 

ముంబై: యాడ్‌ల్యాబ్స్‌ బకాయిల సమస్య ఈ ఏడాది సెప్టెంబర్‌ కంటే ముందే పరిష్కారం కానున్నదని సమాచారం. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) లో కాకుండా బయటనే ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూనియన్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని 13 బ్యాంక్‌ల కన్సార్షియమ్‌ యాడ్‌ల్యాబ్స్‌కు రూ.1,100 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈ రుణాల వసూళ్ల కోసం ఈ బ్యాంక్‌లు యాడ్‌ల్యాబ్స్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించాయి.  అయితే ఈ మొండి బకాయిలను అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలకు విక్రయించడం, లేదా ఈ మేర పెట్టుబడులు పెట్టగల ఇన్వెస్టర్‌ లభించే అవకాశాలు ఉండటం.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే తమ మొండి బకాయిలను ఏఆర్‌సీలకే విక్రయించడానికి బ్యాంక్‌లు మొగ్గుచూపుతున్నాయని సమాచారం. త్వరలోనే రుణాల వేలం జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

యాడ్‌ల్యాబ్స్‌ కంపెనీకి యూనియన్‌ బ్యాంక్‌ రూ.240 కోట్ల రుణాలిచ్చింది. ఈ బ్యాంక్‌ కాకుండా బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లు కూడా రుణాలిచ్చాయి. కాగా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ, ఆర్సిల్‌, తన హెడ్జ్‌ఫండ్‌ భాగస్వామి, అవెన్యూ క్యాపిటల్‌తో కలిసి యాడ్‌ల్యాబ్స్‌ మొండి బకాయిలను కొనుగోలు చేసే ప్రతిపాదనను రుణదాతల ముందు ఉంచాయని వార్తలు వస్తున్నాయి. 
130 ఎకరాల్లో ఇమేజికా...
ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలో దేశంలోనే తొలి థీమ్‌ పార్క్‌, ఇమేజికాను 130 ఎకరాల్లో యాడ్‌ల్యాబ్స్‌ కంపెనీ నిర్వహిస్తోంది. దీంతో పాటు ఒక ఫైవ్‌-స్టార్‌హోటల్‌ను కూడా మన్మోషన్‌ శెట్టి నేతృత్వంలోని యాడ్‌ల్యాబ్స్‌ నిర్వహిస్తోంది. ఇది కాకుండా 204 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని విక్రయించాలని ఈ కంపెనీ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. అయితే న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ భూమి విక్రయ ప్రయత్నాలు ఫలించడం లేదు. యాడ్‌ల్యాబ్స్‌ కంపెనీలో 32 శాతం వాటా మన్మోహన్‌ శెట్టికి ఉండగా, మిగిలింది ప్రజల వద్ద ఉంది.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం అప్‌

Wednesday 3rd July 2019

స్వల్ప లాభనష్టాల మధ్య కన్సాలిడేషన్‌ దిశగా సాగుతున్న మార్కెట్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సూచీ నేడు 31,347.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ అరశాతం(170పాయింట్లు) పెరిగి 31449.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మద్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(31283.30)తో పోలిస్తే 150 పాయింట్ల 31433

ఐటీలో 2.5 లక్షల కొత్త కొలువులు

Wednesday 3rd July 2019

నైపుణ్యాభివృద్ధి పథకాలతో సాధ్యం కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌ పాండే వెల్లడి న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో సమగ్ర నైపుణ్యాభివృద్ధి పథకాల ఊతంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో కొత్తగా 2.5 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్ శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తెలిపారు. డిజిటల్‌ టెక్నాలజీ రంగంలో శరవేగంగా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులతో దేశీయంగా క్లౌడ్‌ కంప్యూటింగ్ మార్కెట్‌ 2022 నాటికల్లా 7.1 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు

Most from this category