News


ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు..!

Thursday 14th November 2019
Markets_main1573701915.png-29567

  • బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) తాజా సిఫార్సులు

న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ & సీఈఓ) బ్యాంక్స్‌ బోర్డ్‌ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్ వీ ప్రభాకర్, అటను కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్‌బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ & సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ఈడీ), దాస్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ & సీఈఓగా ఏ ఎస్ రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. 



You may be interested

రూపాయి... ఒకేరోజు 62 పైసలు పతనం!

Thursday 14th November 2019

రెండు నెలల కనిష్టం... 72.09కి డౌన్‌ ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ బుధవారం 62 పైసలు పతనం అయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్‌లో 72.09 వద్ద ముగిసింది. గడచిన రెండు నెలల్లో (సెప్టెంబర్‌ 4 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలహీనపడ్డం ఇదే తొలిసారి. పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్‌ ద్రవ్యోల్బణం వంటి కీలక ఆర్థిక గణాంకాల నిరుత్సాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలపై అనుమానాలు వంటి

మూడు నెలల్లో బాకీలు కట్టేయాల్సిందే

Thursday 14th November 2019

 టెల్కోలకు టెలికం శాఖ నోటీసులు న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మూడు నెలల్లోగా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తదితర బాకీలన్నీ కట్టేయాలంటూ టెల్కోలకు టెలికం శాఖ (డాట్‌) ఆదేశాలు జారీ చేసింది. స్వయం మదింపు ప్రాతిపదికన బకాయీలను తీర్చవచ్చంటూ నోటీసుల్లో పేర్కొన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. లైసెన్సు ఫీజు మొదలైన వాటికి ప్రాతిపదిక అయిన ఏజీఆర్‌ను (సవరించిన స్థూల ఆదాయం) లెక్కించే ఫార్ములా విషయంలో.. ప్రభుత్వానికి

Most from this category