News


మొండి బాకీలు రూ.లక్ష కోట్లు తగ్గాయి

Wednesday 17th July 2019
news_main1563343843.png-27121

  • 2019 మార్చి నాటికి రూ.9.34 లక్షల కోట్లు
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో వసూలు కాని మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2018-19) రూ.లక్ష కోట్లు తగ్గి, రూ.9.34 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు. ఎన్‌పీఏల గుర్తింపులో పారదర్శకత, పరిష్కారం, వసూలు తదితర చర్యలతో కూడిన సమగ్ర కార్యాచరణణు అనుసరిస్తున్నామని చెప్పారు. అలాగే, ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధన నిధుల సాయం అందించడంతో పాటు, వాటిల్లో సంస్కరణల ద్వారా ఎన్‌పీఏలను తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్టు రాజ్యసభకు మంత్రి లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఎన్‌పీఏల విషయంలో వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. రుణ సంస్కృతిని మార్చేందుకు గాను దివాలా చట్టం (ఐబీసీ) తీసుకువచ్చామని, రుణాలు ఎగ్గొట్టిన కంపెనీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులను ఆస్తుల విక్రయ ప్రక్రియలో పాల్గొనకుండా బహిష్కరించడం వంటి చర్యలను తీసుకున్నామని తెలిపారు. ఈ చర్యలతో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో 2018 మార్చి నాటికి రూ.10,36,187 కోట్లకు చేరిన ఎన్‌పీఏలు, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం 2018-19లో రూ.1,02,562 కోట్ల మేర తగ్గి రూ.9,33,635 కోట్లుగా ఉన్నాయని వివరించారు.
మోసాల నివారణకు చర్యలు... 
2018-19లో రూ.లక్ష అంతకు మించిన మోసాల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకు 374 కేసులను రిపోర్ట్‌ చేయగా, కోటక్‌ మహీంద్రా బ్యాంకులో 338, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 273, ఎస్‌బీఐలో 273, యాక్సిస్‌ బ్యాంకులో 195, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌లో 190 వరకు జరిగినట్టు మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. మోసాలను నివారించేందుకు, రూ.50 కోట్లకుపైగా విలువైన రుణ కేసులను జాగ్రత్తగా పరిశీలించాలని కూడా బ్యాంకులను ఆదేశించినట్టు చెప్పారు. 



You may be interested

ముందుంది ఐపీఓల పండుగ

Wednesday 17th July 2019

ఈ ఏడాది మొదటి 6 నెలలో 8 మాత్రమే గత ఏడాది ఇదే కాలంలో 24 కంపెనీలు      వచ్చే నెలలో అర డజను కంపెనీలు ఐపీఓకి  రావడానికి సిద్ధపడుతున్నాయి. రూ.10,000 కోట్లను సమీకరించడమే లక్ష్యంగా ఇవి ఐపీఓకి రానున్నాయి. స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌, స్పంధన స్ఫూర్తి ఫైనాన్సియల్‌, ఎఫ్ఫెల్‌ ఇండియా, ఏజీఎస్‌ ట్రాన్సక్ట్‌ టెక్నాలజీస్‌, మజగావ్‌ డాక్‌ షిప్‌ బుల్డర్స్‌ వంటి కంపెనీలు అగష్టు

'స్మార్ట్' వాహనాలపై మహీంద్రా దృష్టి

Wednesday 17th July 2019

కేయూవీ, ఎక్స్‌యూవీల్లో ఎలక్ట్రిక్ వెర్షన్ల తయారీ న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్ వాహనాలు, పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీలైన కేయూవీ 100, ఎక్స్‌యూవీ300

Most from this category