News


వచ్చేనెల్లో వరుసగా వారంరోజులు బ్యాంకుల బంద్‌

Friday 21st February 2020
news_main1582282161.png-31991

ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటికీ వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈరోజు( శుక్రవారం) మహాశివరాత్రి కావడంతో పబ్లిక్‌ హాలిడే, రేపు  నాల్గో  శనివారం కావడంతో రేపు సెలవు, ఆ తరువాత ఆదివారం ఎలాగు బ్యాంకులు పనిచేయవు కాబట్టి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీనివల్ల  చెక్‌ క్లియరెన్స్‌ వంటి ముఖ్యమైన కార్యాకలాపాలు, లావాదేవీలకు ఆటంకం ఏర్పడడంతో ఖాతాదారులు ఇబ్బందులు గురవుతున్నారు. వచ్చే నెల(మార్చి)లో కూడా బ్యాంకు కస్టమర్లకు మరిన్ని ఇబ్బందులు ఎదురు కానున్నాయి. బ్యాంకు ఉద్యోగులు మార్చి 11-13వ తేదీ వరకు సమ్మెకు పిలుపునిచ్చారు. 14 రెండో శనివారం, 15 ఆదివారం కావడంతో వారం రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. మరోపక్క మార్చి 8 ఆదివారం కావడం, మంగళవారం(10) హోలి పండుగ కావడంతో ఈ రెండురోజులు... బంద్‌ రోజులు మొత్తం కలిపితే వారం రోజులపాటు బ్యాంకుల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అంటే మార్చినెల రెండో వారంలో మార్చి 9 మాత్రమే బ్యాంకులు  పనిచేస్తాయి. కాగా ఈ ఏడాది బ్యాంకుల సిబ్బంది సమ్మె చేయడం ఇది మూడోసారి. జనవరి 8-9 తేదీలలో ఒకసారి, జనవరి 31, ఫిబ్రవరి1 మరోసారి బ్యాంకు ఉద్యోగులు సమ్మె పాటించిన సంగతి తెలిసిందే.



You may be interested

ఈ ఏడాదీ ఐపీఓల జోరు !

Saturday 22nd February 2020

2020లో ఐపీఓల జోష్‌ ఐపీఓ బాటలో కనీసం 30 కంపెనీలు  రూ.50,000 కోట్లకు పైగా నిధుల సమీకరణ గత ఏడాదితో పోల్చితే నాలుగు రెట్లు  ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే ఉంటే 1.50 లక్షల కోట్లకు ఐపీఓ నిధులు  ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్‌ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్‌ఐసీ ఐపీఓ ఈ ఏడాదే వచ్చే అవకాశాలుంటే ఇది 1.5 లక్షల కోట్ల మేర

ఈ మిడ్‌క్యాప్స్‌పై బ్రోకరేజ్‌ల మక్కువ!

Friday 21st February 2020

కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాల వెల్లడి తుది దశకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఉన్నప్పటికీ... కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు ప్రయోజనాన్ని పొందిన పలు కంపెనీల క్యూ3 ఆదాయాలు అంచనాలకు తగ్గట్టుగానే నమోదయ్యాయి.  అయితే కంపెనీల టాప్‌లైన్ పనితీరు వాస్తవానికి బలహీనంగా ఉంది. అయితే కమోడిటీ ధరల పతనంతో మార్జిన్ విస్తరణ కారణంగా నిర్వహణ వృద్ధి మెరుగ్గా ఉంది. చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా కొన్ని

Most from this category