News


బ్యాంక్‌ సేవలపై  భారత్ బంద్ ప్రభావం 

Thursday 9th January 2020
Markets_main1578540481.png-30777

వాహన ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికం 
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: 
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభాం పాక్షికంగానే  ఉంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్‌ఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్‌ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. 

ఆర్‌బీఐ కార్యలయాల్లోనూ సమ్మె....
పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్‌ విత్‌డ్రాయల్‌, నగదు డిపాజిట్‌ చేయడం, చెక్‌ క్లియరెన్స్‌ వంటి బ్రాంచ్‌ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్‌బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్‌బీఐ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. 

మరోవైపు హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్‌, హోండా కార్స్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ  సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. ప్రతి ఒక్కరికీ కనీస పింఛన్‌ రూ.6,000 ఉండాలని, రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, ప్రజలందరికీ నిత్యావసరాలు తగినంతగా సరఫరా చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 


 You may be interested

బొగ్గులో సంస్కరణల బాజా

Thursday 9th January 2020

ఇతర సంస్థలూ బిడ్‌ చేసేందుకు అవకాశం అంతిమ వినియోగంపై ఆంక్షల తొలగింపు ఈ నెలలోనే 40 దాకా బ్లాకుల వేలం ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది.

భారీ గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌?!

Thursday 9th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 120 పాయింట్లు అప్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం  8.40 ప్రాంతం‍లో 120 పాయింట్లు జంప్‌చేసి 12,186 వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,065 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇరాక్‌లోని అమెరికన్‌ సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్‌

Most from this category