STOCKS

News


మార్చికి నికర ఎన్‌పీఏలు 3.2 శాతానికి దిగొస్తాయి

Friday 27th December 2019
news_main1577420575.png-30470

  • బ్యాంకింగ్‌ రంగంపై ఇక్రా నివేదిక

ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో నికర మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వచ్చే మార్చి నాటికి 3.2-3.3 శాతానికి దిగొస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ‘‘బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. అదే సమయంలో ఎన్‌పీఏలుగా మారే రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణాల మాఫీ గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల వసూళ్లలో పురోగతి ఉంటుంది’’ అని ఇక్రా తన నివేదికలో వివరించింది. 2019 మార్చి నాటికి బ్యాంకింగ్‌ రంగ నికర ఎన్‌పీఏలు 3.8 శాతంగా ఉన్నాయి. 2017-18లో మొండి బకాయిల వసూళ్లు 14.9 శాతంగా ఉంటే, 2018-19లో 15.5 శాతానికి మెరుగుపడినట్టు తెలిపింది. నికర ఎన్‌పీఏలు తగ్గడం వల్ల బ్యాంకుల సాల్వెన్సీ ప్రొఫైల్‌ (భవిష్యత్తు చెల్లింపులకు అనుగుణంగా ఆస్తుల విలువ) వృద్ధి చెందుతుందని ఇక్రా తెలిపింది.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 4.9 శాతానికి...
ప్రభుత్వరంగ బ్యాంకులకు పెద్ద మొత్తంలో మూలధన సాయం, ఎన్‌పీఏలకు కేటాయింపులు పెరగడం కారణంగా.. వాటి నికర ఎన్‌పీఏలు 2018 సెప్టెంబర్‌ నాటికి 7.2 శాతం నుంచి, 2019 సెప్టెంబర్‌ నాటికి 4.8 శాతానికి తగ్గాయని.. వచ్చే మార్చి చివరికి 4.9 శాతం స్థాయిలో ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. ప్రైవేటు బ్యాంకుల నికర ఎన్‌పీఏలు 2019 సెప్టెంబర్‌ చివరికి 1.7 శాతానికి  మెరుగుపడినట్టు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి 1.9 శాతంగా ఉన్నాయి. ఇక 2018-19లో బ్యాంకుల రుణ వ్యాపారం వృద్ధి 13.3 శాతంగా ఉంటే, 2019-20లో 6.5-7 శాతానికి తగ్గొచ్చని ఇక్రా అంచనా వేసింది. 



You may be interested

రామ్‌కో సిమెంట్స్‌ ప్లాంట్‌కు 5 స్టార్‌ రేటింగ్‌

Friday 27th December 2019

చెన్నై: రామ్‌కో సిమెంట్స్‌ గోవిందపురం, అరియలూర్‌ (తమిళనాడు) కర్మాగారానికి పర్యావరణ, ఆరోగ్య, భద్రతకు సంబంధించి ప్రతిష్టాత్మక  సీఐఐ- ఎస్‌ఆర్‌, ఈహెచ్‌ఎస్‌  ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. ఇందుకు సంబంధించి  ఇటీవల జరిగిన సీఐఐ దక్షిణప్రాంత ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు, 2019 కార్యక్రమంలో ‘‘5 స్టార్‌ రేటింగ్‌’’ సర్టిఫికేట్‌ను సంస్థ (అరియలూర్‌) వైస్‌ ప్రెసిడెంట్‌-అడ్మిన్‌ ఎస్‌ రామరాజ్‌ స్వీకరించారు. సీఐఐ-ఎస్‌ఆర్‌ ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌, సుప్రా ఆంకాలజీ ఫౌండర్‌ శ్రీని శ్రీనివాసన్‌ తదితరులు

డేటా వాడేస్తున్నారు

Friday 27th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:- దేశంలో వైర్‌లెస్‌ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్‌ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబరులో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్‌లెస్‌ డేటా యూజర్ల సంఖ్య

Most from this category