News


క్యూ3, క్యూ4లలో బ్యాంకింగ్‌కు వెలుగురేఖలు!

Thursday 9th January 2020
news_main1578540171.png-30774

- భారీ మొండిబకాయిల పరిష్కారం నేపథ్యం
- ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషణ
- నిత్యావసరాలపై అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తత ప్రభావం

ముంబై: భారత్‌ బ్యాంకింగ్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో (అక్టోబర్‌ 2019 - మార్చి2020)లో చక్కటి ఫలితాలు నమోదుచేసుకునే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ విశ్లేషించారు. భారీ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య పరిష్కారం దీనికి ప్రధాన కారణమనీ వివరించారు. ఎన్‌పీఏల పరిష్కార యంత్రాంగం పటిష్టమవుతుండడంతో, రానున్న కాలంలో ఈ సమస్య మరింత తగ్గే అవకాశం ఉందని కూడా ఆయన తెలిపారు.  రుణాలకు సంబంధించి ఎడిల్వీస్‌ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బుధవారం ఆయన మాట్లాడారు.  కొన్ని కీలక అంశాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే...

రుణ వృద్ధి ‘పరుగు’ కష్టమే!
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (2019 ఏప్రిల్‌-సెప్టెంబర్‌) 2018 ఇదే కాలాన్ని పోల్చిచూస్తే ఎస్‌బీఐకి సంబంధించినంతవరకూ రుణ వృద్ధిలేకపోగా ప్రతికూలత నమోదయ్యింది. అయితే అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ మాత్రం ఈ పరిస్థితి మెరుగుపడింది. వార్షిక ప్రాతిపదికన రుణ వృద్ధి దేశీయంగా 5 శాతానికి తగ్గితే, అంతర్జాతీయ మార్కెట్‌కు సంబంధించి ఈ శాతం 7గా ఉంది. మరికొంత కాలం రుణ వృద్ధి మందగమనంలోనే ఉండే అవకాశం ఉంది. గతంలో చూసిన రెండంకెల వృద్ధి కష్టమే. 2018-19లో మొత్తం బ్యాంకింగ్‌  రుణ వృద్ధిరేటు 13.3 శాతం. అయితే  2019 డిసెంబర్‌ 20తో ముగిసిన త్రైమాసికానికి 2018 ఇదే కాలంలో పోల్చిచూస్తే, 7.10 శాతం మాత్రమే పెరిగింది.  విలువ రూపంలో రూ.92.87 లక్షల కోట్ల నుంచి రూ.99.47 లక్షల కోట్లకు చేరింది. 2019-20లో  రుణ వృద్ధిరేటు అరవై సంవత్సరాల కనిష్టస్థాయి 6.5 నుంచి 7 శాతం శ్రేణికి పడిపోయే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ- ఇక్రా ఇటీవలే ఒక నివేదికలో అంచనావేసింది. రుణ మంజూరీల విషయంలో బ్యాంకులు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని, జాగరూకత పాటిస్తున్నాయని ఎస్‌బీఐ చైర్మన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 
- చమురు గ్యాస్‌, సోలార్‌, రహదారుల రంగాల నుంచి బ్యాంకులకు రుణాల డిమాండ్‌ వస్తోంది. 
- 2019-20లో దేశ జీడీపీ వృద్ధిరేటు 11 సంవత్సరాల కనిష్టస్థాయి 5 శాతంలోపునకు పడిపోతుందన్న జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) లెక్కలు... అంచనాలకన్నా తక్కువగా ఉన్నాయి. 
- అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తాయి. ఇది కరెంట్‌ అకౌంట్‌లోటు (క్యాడ్‌), కరెన్సీ విలువపై కూడా ప్రభావం చూపే అంశం. 
- కొన్ని ప్రతికూలతలు ఉన్నా మొత్తంగా  ప్రభుత్వ ఫైనాన్షియల్‌ పరిస్థితులు బాగున్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు (జీడీపీలో 3.3 శాతం) కట్టడిలో ఉండాలని డిమాండ్‌ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనిని ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పట్టంచుకుంటుందని మేము భావించడం లేదు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా కొనసాగుతుంది. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్‌ లక్ష్యం. కానీ అక్టోబర్‌ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు ( బడ్జెట్‌ అంచనాల్లో 102.4 శాతానికి) చేరింది. You may be interested

మారుతీ సుజుకీ ఉత్పత్తిలో పెరుగుదల

Thursday 9th January 2020

- డిసెంబర్‌లో 7.88 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ).. గతేడాది డిసెంబర్‌ నెలలో తన వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అంతక్రితం ఏడాది (2018) డిసెంబర్‌ నెలలోని 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్‌

మిడ్‌క్యాప్‌ నామ సంవత్సరం!

Thursday 9th January 2020

గడిచిన ఏడాది ఏం జరిగింది..? లార్జ్‌క్యాప్‌లు.. మరింత పెద్దవిగా మారాయి. కొనుగోళ్ల మద్దతుతో నాణ్యమైన, అధిక వ్యాల్యూషన్‌ కలిగిన స్టాక్స్‌ మరింత ర్యాలీ చేశాయి. కానీ, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం బాగా దెబ్బతిన్నాయి. కొన్ని అయితే 50 శాతానికి పైగా నష్టపోయాయి. మరి 2020 ఎలా ఉండబోతోంది? గతేడాదితో పోలిస్తే మార్కెట్లలో ధోరణి మారుతుందనే నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌ క్యాప్‌ను పట్టించుకోకుండా, ఒక్కో కంపెనీని విడిగా చూడడం ద్వారా

Most from this category