News


భారత్‌ బ్యాంకింగ్‌ రుణ వృద్ధి అంతంతే!

Friday 10th January 2020
Markets_main1578627139.png-30813

- 2019-2020లో వృద్ధిరేటు కేవలం 5 శాతం
- ప్రపంచబ్యాంక్‌ అంచనా
- 2020-21లో 5.8 శాతానికి పెరిగే అవకాశం
- 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతమే!

వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021)లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది. ‘‘బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో రుణ వృద్ధి బలహీనంగా ఉన్న భారత్‌లో జీడీపీ వృద్ధితీరు మందగమనంలో ఉంది’’ అని ప్రపంచబ్యాంక్‌ బుధవారం విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. తయారీ, వ్యవసాయ రంగాల బలహీనత భారత్‌ వృద్ధి మందగమనానికి కారణాల్లో ఒకటనీ విశ్లేషించింది. కాగా ఎల్‌పీజీపై సబ్సిడీలను క్రమంగా తొలగించడానికి భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రపంచబ్యాంక్‌ ప్రశంసించడం మరో విశేషం.  2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి  2.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.  ‘‘గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్’’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

- 2019తో పోల్చితే 2020లో పెట్టుబడులు, వాణిజ్యం క్రమంగా రికవరీ అయ్యే వీలుంది. అయితే వాణిజ్య యుద్ధం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వృద్ధితీరుకు కొంత ఇబ్బందులూ ఉన్నాయి. 
- అమెరికా వృద్ధిరేటు 2020లో 1.8 శాతంగా నమోదుకావచ్చు. ఇప్పటికే పెంచిన టారిఫ్‌ల ప్రభావం ఏ మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై  ఉంటుందన్న విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. 
- యూరో ప్రాంతంలో 2020లో వృద్ధి ఒకశాతానికి తగ్గిస్తున్నాం. బలహీన పారిశ్రామిక క్రియాశీలత దీనికి ఒక కారణం.
-2022లో దక్షిణాసియా వృద్ధిరేటు 6 శాతంగా ఉండవచ్చు.  
- బంగ్లాదేశ్‌లో వృద్ధిరేటు 7 శాతంగా ఉండే వీలుంది. అయితే పాక్‌లో ఈ రేటు 3 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉండే వీలుంది. 
- అటు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో వృద్ధి స్పీడ్‌ నెమ్మదిగానే ఉండే వీలుంది. విస్తృత ప్రాతిపదికన వృద్ధి సాధనకు విధాన నిర్ణేతలు వ్యవస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. పేదరిక నిర్మూలనకు ఈ చర్యలు కీలకం.
- వ్యాపారాలు చేసుకోడానికి ఎటువంటి అడ్డంకులూ లేని తగిన వాతావరణాన్ని సృష్టించాలి. తగ్గిన చట్టాలు, రుణ నిర్వహణ, ఉత్పత్తి పెంపు వంటి చర్యలు ఈ దిశలో అవసరం. 
- భారత్‌ను ప్రత్యేకంగా చూస్తే, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల కఠిన రుణ పరిస్థితులు దేశీయ డిమాండ్‌ను బలహీనతకు కారణాల్లో ఒకటి. You may be interested

టాటా-జీఐసీ నుంచి జీఎంఆర్‌కు రూ.2,000 కోట్ల రుణం

Friday 10th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. టాటా సన్స్‌, సింగపూర్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ నుంచి ఈ రుణాన్ని సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న రుణాలను తగ్గించుకోవడానికి ఈ నిధులను వినియోగించనుంది. ప్రస్తుతం సంస్థకు రూ.20,000 కోట్లకుపైగా అప్పులున్నాయి. కాగా, హాంకాంగ్‌కు చెందిన ఈఎస్‌ఆర్‌ కేమాన్‌ అనుబంధ కంపెనీతో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ జేవీ

దేశ ఆర్థిక మూలాలు పటిష్టం

Friday 10th January 2020

- ఎకానమీకి పుంజుకునే సత్తా ఉంది - 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరగలం - సమిష్టి కృషితో సాధ్యమే - నీతి ఆయోగ్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ - ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలతో భేటీ న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ప్రస్తుత పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సత్తా ఎకానమీకి పుష్కలంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2024 నాటికి దేశ ఎకానమీ 5 లక్షల కోట్ల డాలర్ల

Most from this category