News


వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

Friday 22nd November 2019
news_main1574394969.png-29777

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 10న పార్లమెంట్ ముందు భైఠాయించాలని బ్యాంక్‌ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్‌ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్‌ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఈఎఫ్‌ఐ) వంటి మొత్తం ఆరు యూనియన్లు ధర్నాలో పాల్గోనున్నట్లు ప్రకటించాయి. 



You may be interested

ప్లాట్‌గా రూపీ

Friday 22nd November 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్లో 71.75 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బలహీనపడడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాల నుంచి కోలుకొని చివరికి 5 పైసలు బలపడి 71.76 వద్ద ముగిసింది. యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగడంతో చమురు ధరలు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌

స్వల్ప నష్టాలతో ప్రారంభం

Friday 22nd November 2019

మార్కెట్లు శుక్రవారం సెషన్‌లో స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌  26.17 పాయింట్లు నష్టపోయి 40549.00 పాయింట్ల వద్ద ప్రారంభమవ్వగా, నిఫ్టీ 18 పాయింట్ల కోల్పోయి 11950.40 వద్ద ప్లాట్‌గా ప్రారంభమయ్యింది. ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా షేర్లు లాభపడిన షేర్లలో ముందుండగా, విప్రో, ఇన్‌ఫ్రాటెల్‌, యూపీఎల్‌ షేర్లు నష్టపోయిన షేర్లలో ముందున్నా‍యి. మొత్తంగా నిఫ్టీ 50లో 21 షేర్లు పాజిటివ్‌గా ప్రారంభమవ్వగా, 29 షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

Most from this category