News


నేడు బ్యాంక్‌ సమ్మె

Tuesday 22nd October 2019
news_main1571714534.png-29035

  • విలీనాలు, ఇతర అంశాలకు నిరసన 
  • సమ్మె ప్రభావం స్వల్పమేనంటున్న ఎస్‌బీఐ 

న్యూఢిల్లీ/కోల్‌కత:  బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్‌ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ)లు క్‌ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి.  అయితే బ్యాంక్‌ ఆఫీసర్లు, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. 

సమ్మె కొనసాగుతుంది...
ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో చీఫ్‌ లేబర్‌ కమీషనర్‌ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్‌. వెంకటాచలమ్‌ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్‌లను కూడా మూసేస్తామని బ్యాంక్‌ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్‌ ఉద్యోగాలను  అవుట్‌ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రైవేటీకరీంచడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్‌ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

ప్రభావం స్వల్పమే !
పలు బ్యాంక్‌లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్‌ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్‌ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్‌బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్‌ బ్యాంక్‌ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది.
గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి. 



You may be interested

పుత్తడి బాండ్ల ఇష్యూ ధర.. రూ.3,835

Tuesday 22nd October 2019

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్‌  ఈ నెల 25న ముగింపు  న్యూఢిల్లీ:- పుత్తడి బాండ్ల ఆరో దఫా జారీని కేంద్రం సోమవారం ప్రారంభించింది. ధన్‌తేరస్‌ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు జోరుగా జరుగుతాయనే అంచనాలతో ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) జారీని కేంద్రం ప్రారంభించింది. ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20-సిరీస్‌ సిక్స్‌.... ధన్‌తేరస్‌ రోజునే (ఈ నెల25న) ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక్కో గ్రామ్‌ ధరను రూ.3,835గా కేంద్రం

మరోసారి సార్వభౌమ గోల్డ్‌ బాండ్‌ ఇష్యూ

Monday 21st October 2019

పండుగల సందర్భంగా బంగారానికి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పౌర్వభౌమ బంగారం బాండ్ల ఇష్యూను ఈ నెల ఆరంభంలో ఒకసారి తీసుకురాగా, తాజాగా మరో ఇష్యూను కూడా చేపట్టింది. ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు సౌర్వభౌమ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20 - సిరీస్‌-5 ఇష్యూను తీసుకొచ్చింది. మళ్లీ పది రోజుల వ్యవధిలోనే మరో ఇష్యూను ప్రకటించి ఆశ్చర్యపరించింది. దీనికి ప్రధాన కారణం

Most from this category