News


నేడు, రేపు బ్యాంకుల బంద్‌

Friday 31st January 2020
news_main1580440470.png-31349

వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని.. అందుకే సమ్మెకు సిద్ధమయ్యామని యూఎఫ్‌బీయూ తెలిపింది. శుక్ర, శనివారాల్లో జరగనున్న సమ్మెలో ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్‌సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్‌ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ, ఎన్‌ఓబీడబ్ల్యూ, ఎన్‌ఓబీఓ బ్యాంకింగ్‌ సంఘాలు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. గ్రామీణ బ్యాంకులు మాత్రమే సమ్మెలో పాల్గొనడం లేదని, మద్దతు మాత్రం తెలుపుతున్నట్లు ఆల్‌ ఇండియా రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ ఎస్‌.వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా సమ్మె ఉంటుందని యూఎఫ్‌బీయూ హెచ్చరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ రోజు కూడా బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెలోనే పాల్గొంటారు. 2వ తేదీ ఆదివారం. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. పునఃప్రారంభం సోమవారమే. You may be interested

బజాజ్‌ ఆటో లాభం రూ.1,322 కోట్లు

Friday 31st January 2020

(అప్‌డేటెడ్‌...) 8 శాతం వృద్ధి  రూ.7,640 కోట్లకు పెరిగిన ఆదాయం  న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం, బజాజ్‌ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 8 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.1,221 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,322 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,436 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.7,640 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ముడి పదార్థాల

మూడు రెట్లు ఎగసిన ఐఓసీ లాభం

Friday 31st January 2020

2,339  కోట్లకు నికర లాభం  కలసివచ్చిన ఇన్వెంటరీ లాభాలు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్‌ ఆయిల్ కార్పొ(ఐఓసీ) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.717 కోట్లుగా ఉన్న నికర లాభం (స్టాండ్‌అలోన్‌) ఈ క్యూ3లో రూ.2,339 కోట్లకు పెరిగిందని ఐఓసీ తెలిపింది. రిఫైనరీ మార్జిన్‌లు తక్కువగా ఉన్నా, కరెన్సీ పరమైన నష్టాలు ఉన్నా, ఇన్వెంటరీ

Most from this category