News


తప్పు చేయకుంటే.. భయమక్కర్లేదు

Wednesday 29th January 2020
news_main1580277753.png-31300

  • బ్యాంకర్లకు కేంద్రం భరోసా

న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్‌పీఏ) తీవ్రత, మోసాలు పెరగడం వంటి పరిస్థితుల్లో  ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అని భయాందోళనలకు గురవుతున్న బ్యాంకర్లకు భరోసా లభించింది. తీసుకున్న నిర్ణయం విషయంలో వైఫల్యం ఉన్నా... అందులో దురుద్ధేశాలు లేనట్లయితే బ్యాంకర్లు భయపడాల్సిన పనిలేదని సంకేతాలిస్తూ, కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. బ్యాంక్‌ అధికారులు కొందరు పాల్పడే భారీ మోసాలపై తీసుకునే చర్యల విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎండీ, సీఈఓలను వ్యక్తిగత బాధ్యతల నుంచి మినహాయించడం ఈ నిర్ణయాల్లో ఒకటి. మోసాల నివారణ, విచారణలకు సంబంధించి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అధికారాలను ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్‌ఎస్‌) నుంచి ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బోర్డ్‌లకు బదలాయిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే సంబంధిత విచారణ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ సర్క్యులర్లు నిర్ధేశించిన సమయాల్లో పూర్తికావాల్సి ఉంటుంది. 



You may be interested

రూ.400 తగ్గిన పుత్తడి

Wednesday 29th January 2020

రూ.400 తగ్గిన బంగారం  కరోనా వైరస్‌ ప్రభావంతో గత కొద్ది రోజులుగా అమాంతం పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగివచ్చాయి. బుధవారం 10.45 గంటల ప్రాంతంలో క్రితం రోజుతో పోలిస్తే ఎంసీఎక్స్‌లో రూ. 400 తగ్గుదలతో 10 గ్రాముల పసిడి 40,091.00వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడం, రూపాయి పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం రోజుతో పోలిస్తే 14 డాలర్లు తగ్గి  ఔన్స్‌ బంగారం

ఆ స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదు:రతన్‌ టాటా

Wednesday 29th January 2020

ముంబై: ఇన్వెస్టర్ల డబ్బులను వృధాచేసి, మాయమైన స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘కొన్ని స్టార్టప్స్‌ ఇట్టే ఆకట్టుకుంటాయి. డబ్బులు వసూలు చేస్తాయి. ఆ తర్వాత కనుమరుగవుతాయి. అటువంటి స్టార్టప్స్‌కు రెండు, మూడవ అవకాశం ఉండదు’ అని అన్నారు. టైకాన్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి చేతుల మీదుగా స్వీకరించిన సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు

Most from this category