News


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.138 కోట్లు

Saturday 1st February 2020
news_main1580533781.png-31392

  • గత క్యూ3లో రూ.4,644 కోట్ల నష్టాలు 
  • రూ.13,431 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.138 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.4,644 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.11,791 కోట్ల నుంచి రూ.13,431 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.9,202 కోట్ల నుంచి రూ.3,779 కోట్లకు తగ్గాయి. మొత్తం కేటాయింపులు రూ.9,124 కోట్ల నుంచి రూ.4,028 కోట్లకు చేరాయి.

గత క్యూ3లో 16.31 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 16.30 శాతానికి తగ్గగా, నికర మొండి బకాయిలు మాత్రం 5.97 శాతం నుంచి 5.87 శాతానికి పెరిగాయి. 



You may be interested

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్‌ : వ్యవసాయానికి పెద్దపీట

Saturday 1st February 2020

నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్‌‌ను వినేందుకు ఆమె కుమార్తె వాంగ్మయి, సహా కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు. వారిని పార్లమెంట్‌ సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు. పార్లమెంట్ హాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ బడ్జెట్ 2020-21కి ఆమోదం తెలిపింది.  పార్లమెంట్‌లో మొదలైన ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రసంగం దేశంలో అన్ని వర్గాల, రంగాల ఆశలను, ఆంక్షాలను పరిష్కరించడమే బడ్జెట్‌ లక్ష్యం సాహసోపేతంగా ప్రవేశపెట్టిన జీఎస్‌టీ అద్భుతమైన ఫలితాలను

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,631 కోట్లు

Saturday 1st February 2020

13 శాతం వృద్ధి  4 శాతం వృద్ధితో రూ.9,953 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,631 కోట్ల​ నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.1,444 కోట్లుతో పోల్చితే 13 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. మార్జిన్లు మెరుగుపడటం, అమ్మకాల వృద్ధి కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

Most from this category