News


బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభం రూ.266 కోట్లు

Saturday 2nd November 2019
news_main1572668056.png-29301

  • 32 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 
  • రూ.11,986 కోట్లకు చేరిన మొత్తం ఆదాయం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.266 కోట్ల నికర లాభం సాధించింది. కేటాయింపులు తగ్గడం, నికర వడ్డీ ఆదాయం బాగా ఉండటం, ఇతర ఆదాయం పెరగడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,156 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది.  మొత్తం ఆదాయం రూ.10,800 కోట్ల నుంచి రూ.11,986 కోట్లకు పెరిగిందని వివరించింది. 
18 క్వార్టర్ల గరిష్టానికి నికర వడ్డీ మార్జిన్‌...
నికర వడ్డీ ఆదాయం 32 శాతం వృద్ధితో రూ.3,861 కోట్లకు, ఇతర ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.1,327 కోట్లకు  పెరిగాయని  బ్యాంక్‌ పేర్కొంది. నిర్వహణ లాభం 49 శాతం ఎగసి రూ.2,460 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.27 శాతం నుంచి 2.99 శాతానికి పెరిగింది. ఇది 18 క్వార్టర్ల గరిష్ట స్థాయి. 
స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు...
ఈ బ్యాంక్‌ మొండి బకాయిలు స్వల్పంగా తగ్గాయి. గత క్యూ2లో 16.36 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 16.31 శాతానికి తగ్గాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. నికర మొండి బకాయిలు 7.64 శాతం నుంచి 5.77 శాతానికి తగ్గాయని పేర్కొంది. విలువ పరంగా చూస్తే, ఈ సెప్టెంబర్‌ క్వార్టర్‌ నాటికి స్థూల మొండి బకాయిలు రూ.61,475.60 కోట్లుగా ఉన్నాయి. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. గత క్యూలో రూ.3,343 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ2లో దాదాపు సగం తగ్గి రూ.1,452 కోట్లకు చేరాయని వివరించింది. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 77.12 శాతానికి పెరిగిందని పేర్కొంది. 



You may be interested

మరిన్ని మెట్రో నగరాలకు ఐస్ప్రౌట్‌

Saturday 2nd November 2019

2020లో అదనంగా ఆరు కేంద్రాలు తోడవనున్న 5,000 సీట్ల సామర్థ్యం సాక్షితో ఐస్ప్రౌట్‌ సీఈవో సుందరి పాటిబండ్ల హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- కార్యాలయం ఏర్పాటు పెట్టుబడితో కూడుకున్నది. అందుకే అన్ని సౌకర్యాలు, వసతులతో వినియోగానికి సిద్ధంగా ఉన్న కో-వర్కింగ్‌ స్పేస్‌ కల్చర్‌ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు ఇప్పుడు ఈ కేంద్రాలే అడ్డా అని అంటున్నారు ఐస్ప్రౌట్‌ సీఈవో, కో-ఫౌండర్‌ సుందరి పాటిబండ్ల. కంపెనీ ఆరవ సెంటర్‌ను హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో

సిగ్నిటీ టెక్నాలజీస్‌కు రూ.36 కోట్ల లాభం

Saturday 2nd November 2019

హైదరాబాద్‌: సిగ్నిటీ టెక్నాలజీస్‌ సంస్థ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రింత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం

Most from this category