News


డిజిటల్‌ చెల్లింపుల చార్జీలను ఎత్తివేసిన బీఓబీ

Friday 20th March 2020
news_main1584677321.png-32588

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమ వంతు పాత్రగా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వెల్లడించింది. ఇందులో భాగంగా ‘స్టే సేఫ్‌, బ్యాంక్‌ సేఫ్‌’ పేరిట స్కీంను గురువారం ప్రకటించింది. కస్టమర్లు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ చెల్లింపులపై మూడు నెలలపాటు చార్జీలను ఎత్తివేసినట్లు వివరించింది. 



You may be interested

దయచేసి బ్యాంకులకు రాకండి: యాక్సిస్‌ బ్యాంక్‌

Friday 20th March 2020

కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం బ్యాంకు శాఖలను సందర్శించడం వీలైనంత మేర తగ్గించివేయాలని యాక్సిస్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు సూచించింది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌లను వినియోగించుకుని అందరం సమిష్టిగా కరోనాను ఎదుర్కొందామని బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్ చౌదరి తమ కస్టమర్లకు ఈ-మెయిల్స్‌ పంపారు. ఉద్యోగుల రక్షణ కోసం అన్ని శాఖల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 

‘వివాద్‌ సే విశ్వాస్‌’ కింద ఇక డిక్లరేషన్లు!

Friday 20th March 2020

స్కీమ్‌ను నోటిఫై చేసిన ఐటీ డైరెక్టరేట్‌ (సిస్టమ్స్‌)  వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద డిక్లరేషన్‌ సమర్పించడానికి సంబంధించి ఆన్‌లైన్‌ విధివిధానాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (సిస్టమ్స్‌) గురువారం నోటిఫై చేసింది. దీనివల్ల ఈ పథకం ద్వారా ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కారాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు ఐటీ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై తమ డిక్లరేషన్లను సమర్పించడానికి వీలు కలుగుతుంది. అంతక్రితం ప్రభుత్వం పథకానికి సంబంధించి నియమ నిబంధనలను, పథకం కింద ఆన్‌లైన్‌

Most from this category