News


అమ్మకానికి దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం

Friday 13th September 2019
news_main1568348706.png-28344

  • రిజర్వ్‌ ప్రైస్‌ రూ. 530 కోట్లు

ముంబై: దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్ పత్రం ప్రకారం.. ఈ-వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్‌ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్, ఫిక్ఛర్స్‌ ఆస్తిలో భాగం కాదని ప్రకటనలో వివరించింది. కార్యాలయం 2,878.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. బిల్డ్‌ అప్‌ ఏరియా 9,953.73 చదరపు మీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమైయ్యాయి.



You may be interested

డేటా కొత్త ఆయిల్‌ కాదు

Friday 13th September 2019

దీన్ని దేశ సరిహద్దుల పరిధిలోనే నిలిపివేయకూడదు సాఫీగా సరిహద్దులు దాటిపోయేలా చూడాలి ముకేశ్‌ అంబానీకి ఫేస్‌బుక్‌ కౌంటర్‌ న్యూఢిల్లీ: డేటా విషయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అం‍బానీ ప్రకటనకు కౌంటర్‌గా అన్నట్టు ఫేస్‌బుక్‌ భిన్నంగా స్పందించింది. డేటా అన్నది కొత్త చమురు కాదని, దీన్ని ఒక దేశం పరిధిలోనే నిల్వ చేయరాదని ఫేస్‌బుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నిక్‌క్లెగ్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ వంటి దేశాలు డేటాను ఓ పరిమిత వస్తువుగా నిలిపివేయకుండా, సాఫీగా దేశ

ఈసీబీ తాజా ఉద్దీపన

Friday 13th September 2019

22 బిలియన్‌ డాలర్ల  విలువైన బాండ్ల కొనుగోలు రివర్స్‌ డిపాజిట్‌ రేట్లు మరింత కిందకు... లండన్‌: ఆర్థిక పరిస్థితులను చక్రదిద్దే క్రమంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మరో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది. దీనిప్రకారం, నెలకు 20 బిలియన్‌ యూరోల (22 బిలియన్ల అమెరికా డాలర్లు) విలువైన బాండ్లను వ్యవస్థ నుంచి కొనుగోలు చేయనుంది. దీనితో ఆర్థిక వ్యవస్థలోకి ఈ మొత్తం వచ్చి, ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నది సిద్దాంతం. ఇక ఇదే దిశలో వడ్డీరేట్లనూ

Most from this category