News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టాలు రూ.1,407 కోట్లు

Saturday 25th January 2020
news_main1579922944.png-31185

  • పెరిగిన మొండి కేటాయింపులు 
  • స్వల్పంగా తగ్గిన మొండి బకాయిలు 

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌  బరోడాకు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి.  గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.436 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.1,407 కోట్ల నికర నష్టాలు వచ్చాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎమ్‌డీ, సీఈఓ సంజీవ్‌ చంద్ర తెలిపారు. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడంతో ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమవుతున్నాయి.  

మరిన్ని వివరాలు...

గత క్యూ3లో రూ.4,504 కోట్లుగా ఉన్న మొండి బకాయిలకు కేటాయింపులు ఈ క్యూ3లో 47 శాతం పెరిగి రూ.6,621 కోట్లకు చేరాయి. . మొత్తం కేటాయింపులు  54 శాతం పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.7,128 కోట్లకు పెరగ్గా, నికర వడ్డీ  మార్జిన్‌ 2.62 శాతానికి చేరింది. స్థూల మొండి బకాయిలు 10.91 శాతం నుంచి 10.43 శాతానికి, నికర మొండి బకాయిలు 4.79 శాతం నుంచి 4.05 శాతానికి తగ్గాయి. ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు రూ.10,387 కోట్లుగా ఉన్నాయి. దీంట్లో ఆర్‌బీఐ గుర్తించిన మొండి బకాయిల మళ్లింపులు రూ.4,509 కోట్ల మేర ఉన్నాయి. 



You may be interested

62 శాతం ఎగసిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

Saturday 25th January 2020

తగ్గిన మొండి బకాయిలు  క్యూ3లో రూ.4 లక్షల కోట్ల వ్యాపారం చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 62 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.152 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.247 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ పద్మజా చందూర్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.5,269 కోట్ల నుంచి రూ.6,506 కోట్లకు

మందగమనం తాత్కాలికమే.. ఇకపై పురోగతి

Saturday 25th January 2020

భారత్‌ ఎకానమీపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా వ్యాఖ్య ముగిసిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన

Most from this category