News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.737 కోట్లు

Saturday 9th November 2019
news_main1573274244.png-29471

73 శాతం అప్‌
రూ.22,098 కోట్లకు మొత్తం ఆదాయం 

న్యూఢిల్లీ: 

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.737 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.425 కోట్ల నికర లాభం ఆర్జించామని, 73 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,430 కోట్ల నుంచి రూ.22,098 కోట్లకు పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.., 
 

తగ్గిన ‘మొండి’ భారం...
బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ2లో 11.78 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.25 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 4.86 శాతం నుంచి 3.91 శాతానికి చేరాయి. మొండి బకాయిలు పెరిగినప్పటికీ, కేటాయింపులను ఈ బ్యాంక్‌ పెంచింది. కేటాయింపులు రూ.2,430 కోట్ల నుంచి రూ.4,209 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 77.88 శాతానికి పెరిగింది. 

కేంద్ర ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన షేర్లు కేటాయించి రూ.7,000 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. 



You may be interested

బంగారం ధర మరింత తగ్గుతుందా?

Saturday 9th November 2019

బంగారం ధరలు గత కొద్దిరోజుల నుంచి 1,520-1,485 డాలర్ల శ్రేణిలో కదులుతున్నాయి. గోల్డ్‌ బుల్స్‌ తదుపరి ర్యాలీ కోసం వేచి చూస్తున్నప్పటికి యుఎస్‌-చైనా మధ్య ట్రేడ్‌వార్‌ ముగిసే సూచనలు కన్పిస్తుండటంతో, ఈ ర్యాలీ ఆలస్యమవుతోంది. అయినప్పటికీ ప్రస్తుతం బంగారం ధరలు వాటి 200 డీఎంఏ స్థాయికి చాలా ఎగువనే ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ముగిస్తే బంగారం ధరలు పడిపోడానికి అవకాశం ఉంది. డాలర్‌ బలహీనంగా ఉన్నప్పటికి, యుఎస్‌ ఆర్థిక డేటా బలంగా ఉండడం, వాణిజ్య

మూడిస్‌ ‘రేటింగ్‌’ షాక్‌

Saturday 9th November 2019

భారత క్రెడిట్‌ రేటింగ్‌ ‘నెగెటివ్‌’కు తగ్గింపు ఇప్పటి వరకు స్థిర రేటింగ్‌ సమీప కాలంలో వృద్ధి కోలుకోకపోవచ్చని అంచనాలు భారత్‌ మూలాలు పటిష్టమన్న కేంద్రం న్యూఢిల్లీ: భారత క్రెడిట్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ (దృక్పథాన్ని)ను ప్రతికూలానికి (నెగెటివ్‌) మారుస్తూ అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇది స్థిరం (స్టెబుల్‌)గా ఉంది. ఆర్థిక రంగ బలహీనతలను సరిదిద్దే విషయంలో భారత ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేకపోయినట్టు మూడిస్‌ పేర్కొంది. దీంతో సమస్యలు పెరిగాయని,

Most from this category