News


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.826 కోట్లు

Friday 26th July 2019
Markets_main1564132333.png-27331

  • రూ.22,057 కోట్లకు మొత్తం ఆదాయం 
  • నికర వడ్డీ మార్జిన్‌ 2.73 శాతం 
  • 21 శాతం వృద్ధి చెందిన రిటైల్‌ రుణాలు 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌కు రూ.826 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.646 కోట్ల నికర లాభం ఆర్జించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ల విలీనం తర్వాత తాము వెల్లడిస్తున్న తొలి ఆర్థిక ఫలితాలు ఇవని, అందుకని గత క్యూ1, ఈ క్యూ1 ఆర్థిక ఫలితాలను పోల్చడానికి లేదని పేర్కొంది. గత క్యూ1లో రూ.13,730 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.22,057 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 2.6 శాతం వృద్ధితో రూ.6,496 కోట్లకు పెరిగిందని తెలిపింది. గత క్యూ4లో 2.78 శాతంబ ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ1లో 2.73 శాతానికి తగ్గిందని పేర్కొంది. 
4 శాతం పెరిగిన నిర్వహణ లాభం 
స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, ఈ క్యూ1లో నికర లాభం రూ.709 కోట్లు, మొత్తం ఆదాయం రూ.20,861 కోట్లని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. గత క్యూ1లో రూ.528 కోట్ల నికర లాభం, రూ.12,788 కోట్ల ఆదాయం వచ్చాయని పేర్కొంది. స్టాండ్‌అలోన్‌ నిర్వహణ లాభం 4 శాతం వృద్ధితో రూ.4,276 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, 34 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. 
తగ్గిన తాజా మొండి బకాయిలు....
ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 10.28 శాతంగా, నికర మొండి బకాయిలు 3.95 శాతంగా ఉన్నాయని బ్యాంక్‌ తెలిపింది. గత క్యూ1లో స్థూల మొండి బకాయిలు 12.46 శాతమని, నికర మొండి బకాయిలు 5.4 శాతమని వెల్లడించింది. ఈ క్యూ1లో తాజా మొండి బకాయిలు రూ.5,583 కోట్లని, సీక్వెన్షియల్‌గా చూస్తే, తాజా మొండి బకాయిలు తగ్గాయని తెలిపింది. ఈ క్యూ1లో రూ.3,168 కోట్ల కేటాయింపులు జరిపామని తెలిపింది. రిటైల్‌ రుణాలు 21 శాతం వృద్ధి చెందడంతో మొత్తం రుణాలు 5 శాతం ఎగసి రూ.5.33 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ.7.85 లక్షల కోట్లకు చేరాయని తెలిపింది. 



You may be interested

జెట్‌ ఎయిర్‌వేస్‌పై ఇండిగో కన్ను

Friday 26th July 2019

టీపీజీ క్యాపిటల్‌తో కలసి బిడ్‌ వేసే యోచన రంగంలోకి అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి,

యస్‌బ్యాంక్‌ 10శాతం జంప్‌

Friday 26th July 2019

ప్రైవేట్‌ రంగ బ్యాంకు యస్‌ బ్యాంకు షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 10శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో యస్‌బ్యాంక్‌ షేర్లు రూ.88.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా దేశపు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ టీపీజీ క్యాపిటల్‌, బ్రిటన్‌ దేశపు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషన్‌లు సంస్థలు యస్‌ బ్యాంకులో దాదాపు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఈ బ్యాంకు షేర్లకు

Most from this category