News


ఎక్కువ వేతనాలు బెంగళూరులో

Friday 20th December 2019
news_main1576812384.png-30321

  • ఎక్కువగా పారితోషికం ఐటీ రంగంలో
  • వేతన ధోరణులపై రాండ్‌స్టాడ్‌ నివేదిక

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేతన చెల్లింపులకు రాజధానిగా బెంగళూరు తన స్థానాన్ని కాపాడుకుంది. అలాగే, అత్యధిక పారితోషికాలు ఐటీ రంగంలో ఉన్నట్టు రాండ్‌స్టాడ్‌ ‘ఇన్‌సైట్స్‌ శాలరీ ట్రెండ్స్‌ 2019’ నివేదిక వెల్లడించింది. బెంగళూరులో జూనియర్‌ స్థాయి ఉద్యోగిపై కంపెనీ వార్షికంగా చేస్తున్న సగటు వ్యయం (సీటూసీ) రూ.5.27 లక్షలుగా ఉంటే, మధ్య స్థాయి ఉద్యోగిపై ఇది రూ.16.45 లక్షలు, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగిపై రూ.35.45 లక్షలుగా ఉంది. ఈ సంస్థ రూపొందించిన 2018, 2017 నివేదికల్లోనూ అత్యధిక వేతనాలున్న నగరంగా బెంగళూరు మొదటి ‍స్థానంలో నిలవడం గమనార్హం. జూనియర్‌ లెవల్‌ ఉద్యోగులకు అధికంగా చెల్లింపులున్న రెండో నగరంగా హైదరాబాద్‌ చోటు సంపాదించింది. ఇక్కడ సగటు సీటూసీ రూ.5లక్షలు. రూ.4.59 లక్షలతో మూడో స్థానంలో ముంబై నగరం ఉంది. మధ్య స్థాయి ఉద్యోగులకు అధికంగా చెల్లిస్తున్న నగరాల్లో ముంబై రూ.15.07 లక్షలతో రెండో స్థానంలో, దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) రూ.14.5 లక్షలతో మూడో స్థానంలో ఉన్నాయి. అలాగే, సీనియర్‌ లెవల్‌ ఉద్యోగుల విషయంలో సగటున రూ.33.95 లక్షలతో ముంబై, రూ.32.68 లక్షలతో పుణె రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. జూనియర్‌ స్థాయి, సీనియర్‌ స్థాయిల్లో సగటున అధిక సీటూసీ ఐటీ నిపుణులకే ఉంది. ఇది జూనియర్‌ స్థాయి ఉద్యోగులకు రూ.4.96 లక్షలు కాగా, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు రూ.35.84 లక్షలు కావడం గమనార్హం.  జూనియర్‌, సీనియర్‌ ఉద్యోగులకు అత్యధికంగా వెచ్చిస్తున్న రెండో రంగం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌.
వీరికి డిమాండ్‌ 
డిజిటల్‌ నైపుణ్యాలు, క్లౌడ్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, అనలైటిక్స్‌, ఏఐ, ఆటోమేషన్‌ విభాగాల్లో నిపుణులకు డిమాండ్‌ పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, జీఎస్‌టీ కాంప్లియన్స్‌ స్పెషలిస్టులు, అకౌంటెంట్లు, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లు, లాయర్లకు కూడా డిమాండ్‌ పెరుగుతున్నట్టు తెలిపింది. 



You may be interested

ఐదేళ్లలో రెట్టింపు కానున్న రిటైల్‌ రుణాలు

Friday 20th December 2019

రూ.96 లక్షల కోట్లకు..: ఐసీఐసీఐ బ్యాంకు ముంబై: ఫైనాన్స్‌ సంస్థల రుణ పుస్తకం విలువ 2019 మార్చి నాటికి రూ.48 లక్షల కోట్లుగా ఉండగా, ఇది వచ్చే ఐదేళ్ల కాలంలో 2024 నాటికి రూ.96 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని ఐసీఐసీఐ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ప్రైవేటు వినియోగం (ఇల్లు, కారు, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌, క్రెడిట్‌ కార్డులు) కారణంగా రుణ మార్కెట్‌ భారీగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. వినియోగదారుల్లో రుణాలు

రూ.500 కోట్లు దాటిన ‘పెప్స్‌’ వ్యాపారం

Friday 20th December 2019

బెంగళూరులో ఘనంగా 14వ వార్షికోత్సవం సాక్షి బెంగళూరు: వ్యాపారంలో ఎంతమందికి చేరువయ్యామన్నదే ప్రధానమని పెప్స్‌ ఇండస్ట్రీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.మాధవన్‌ చెప్పారు. సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా గురువారమిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... శరీరానికి నిద్ర ప్రధానం కాబట్టి ఎలాంటి పరుపు కొనాలనే దానిపై ప్రస్తుతం ఎందరినో సంప్రతించాల్సి వస్తోందని చెప్పారు. గత 14 ఏళ్లలో దేశ వ్యాప్తంగా లక్షల మంది పెప్స్‌ పరుపులు

Most from this category