STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ నుంచి ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’..!

Saturday 24th August 2019
news_main1566622590.png-27985

  • స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో సేవలు

కోల్‌కతా: ప్రైవేట్‌ రంగానికి చెందిన బంధన్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు ‘కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌’లను జారీ చేయనుంది. ఈ సేవలను అందించడం కోసం తాజాగా స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్‌ ఘోష్‌ ప్రకటించారు. మూడు వేరియంట్లలో కార్డుల జారీ కానుండగా, క్రెడిట్‌ పిరియడ్‌ 52 రోజులుగా నిర్ణయించామని ఆయన వివరించారు. ఈ అంశంపై స్టాండర్డ్‌ చార్టర్‌ సీఈఓ జరీన్ దారువాలా మాట్లాడుతూ.. ‘అనేక కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ సేవలను మేం అందిస్తున్నప్పటికీ.. ఒక బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందించడం ఇదే ప్రథమం. వినియోగదారుల వ్యయాలు బాగా పెరుగుతున్నందున క్రెడిట్‌ కార్డు వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇక బంధన్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం విషయానికి వస్తే.. బ్యాక్‌-ఎండ్‌ సపోర్ట్‌ ఇవ్వనున్నాం. అప్లికెంట్ల క్రెడిట్‌ ఫిల్టర్‌ సేవలను మేం అందించనున్నాం’ అని వివరించారు.



You may be interested

ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్‌కు వాటాలు

Saturday 24th August 2019

49 శాతం కొనుగోలుకు ఒప్పందం పరోక్షంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో 3.58 శాతం వాటాలు న్యూఢిల్లీ: అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఫ్యూచర్‌ కూపన్స్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా పరోక్షంగా ఫ్యూచర్ రిటైల్‌లో (ఎఫ్‌ఆర్‌ఎల్‌) కూడా వాటాలు దక్కించుకోనుంది. ఫ్యూచర్‌ కూపన్స్‌కు ఫ్యూచర్ రిటైల్‌లో 7.3 శాతం వాటాలు ఉన్నాయి. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాలను కొనుగోలు చేయడం ద్వారా ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు 3.58 శాతం

హైదరాబాద్‌ వద్ద ఎన్‌సీఎల్‌ మరో ప్లాంటు

Saturday 24th August 2019

ప్రీ-ఇంజనీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ తయారీ చైనా కంపెనీ సిండావోతో జేవీ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- సిమెంటు, బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ రంగంలో ఉన్న ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌.. ప్రీ-ఇంజనీర్డ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని మల్కాపూర్‌ వద్ద ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. చైనాకు చెందిన సిండావో జింగ్‌జాంగ్‌ స్టీల్‌ స్ట్రక్చర్స్‌తో కలిసి ఈ యూనిట్‌ను స్థాపిస్తున్నారు. జేవీలో ఎన్‌సీఎల్‌కు 70 శాతం, సిండావోకు 30 శాతం వాటా

Most from this category