News


సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాం‍క్‌ వడ్డీ తగ్గింపు

Tuesday 18th June 2019
news_main1560838330.png-26374

కోల్‌కతా: సూక్ష్మ రుణాలపై బంధన్‌ బ్యాంక్‌ వడ్డీరేటు 70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 17.95 శాతానికి చేరింది. బ్యాంక్‌ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సవరించిన రేటు... మంగళవారం నుంచీ ‍ఇచ్చే కొత్త రుణ పంపిణీలకు వర్తిస్తుందని పేర్కొంది. అంతకుముందు కేవలం మైక్రోఫైనాన్స్‌ కంపెనీగా ఉన్న ఈ బ్యాంక్‌, గత నాలుగేళ్లుగా పూర్తి స్థాయి బ్యాంక్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అటు తర్వాత ఈ బ్యాంక్‌ సూక్ష్మ రుణ రేట్లును 445 బేసిస్‌ పాయింట్లు (4.45 శాతం) తగ్గించింది. ఈ విభాగంలో రేటు తగ్గింపువల్ల మరింత మంది ప్రజలకు తగిన వడ్డీకి రుణాలు అందుబాటులోకి వస్తాయిని, చిన్న వ్యాపారాలకు ఇది వరమని బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ చంద్ర శేఖర్‌ ఘోష్‌ పేర్కొన్నారు. అల్పాదాయ వర్గాల జీవన ప్రమాణాల మెరుగు విషయంలో రేట్ల తగ్గింపు కీలకమని వివరించారు. బంధన్‌ బ్యాంక్‌కు దేశ వ్యాప్తగా 998 బ్రాంచీలు, 481 ఏటీఎం నెట్‌ వర్క్‌ ఉంది. మార్చి 31వ తేదీ నాటికి బ్యాంక్‌ లోన్‌ బుక్‌ పరిమాణం రూ.44,776 కోట్లు. డిపాజిట్లు రూ.43,232 కోట్లు.



You may be interested

హీరోమోటో కార్ప్‌ ప్రచారకర్తగా ఫెర్నాండో మినా

Tuesday 18th June 2019

న్యూఢిల్లీ: ప్రముఖ కొలంబియా ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ‘ఎర్రి ఫెర్నాండో మినా’ను తమ కంపెనీ నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు హీరోమోటో కార్ప్‌ సోమవారం ప్రకటించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కొలంబియా ద్విచక్ర వాహన మార్కెట్‌లో పట్టుపెంచుకోవడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త ప్రీమియం మోటార్ సైకిళ్ళు, హై-పవర్‌ స్కూటర్లు, అధునాతన సాంకేతిక ద్విచక్ర వాహనాలను అక్కడి మార్కెట్లో ప్రవేశపెడుతుండగా.. ఈ సమయంలో యువతను ఆకట్టుకోగలిగే విధంగా

ఇండిగో షేరుకు ఆర్డర్ల హుషారు!

Tuesday 18th June 2019

బీఎస్‌ఈ లో 2శాతం​పెరిగిన షేరు విలువ ఇండిగో షేరు విలువ మంగళవారం సెషన్‌లో 2 శాతం పెరిగి రూ. 1,673.60వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ ఆధారిత సీఎఫ్‌ఎమ్‌ ఇంటర్నేషనల్‌ లీప్‌-1ఏ ఇంజిన్‌ల కోసం 20 బిలియన్‌ డాలర్ల ఆర్డర్లను పెట్టామని కంపెనీ ప్రకటించడంతో ఇండిగో షేరు విలువ పెరిగింది.  గత మూడేళ్ల నుంచి ఉపయోగిస్తున్నా ఏ320 నియో ఇంజిన్‌ల వలన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అందుకే సీఎఫ్‌ఎమ్‌ ఇంజిన్‌లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నామని కంపెనీ తెలిపింది.

Most from this category