News


బంధన్ బ్యాంకులో ఎఫ్‌ఐఐ పరిమితి పెంపు..

Tuesday 5th November 2019
news_main1572926226.png-29353

న్యూఢిల్లీ: ప్రమోటరు షేర్‌హోల్డింగ్‌ను ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయికి తగ్గించే క్రమంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 49 శాతానికి పెంచేందుకు బంధన్ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 24 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని ప్రత్యేక తీర్మానం ద్వారా 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు అక్టోబర్ 24న జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం బంధన్ బ్యాంక్‌లో ఎఫ్‌పీఐలు, ఎఫ్‌ఐఐలకు పెయిడప్ వోటింగ్ ఈక్విటీ క్యాపిటల్‌లో సుమారు 13.27 శాతం వాటా ఉంది. మొత్తం ఈక్విటీ క్యాపిటల్‌లో విదేశీ పెట్టుబడుల వాటా 18.26 శాతంగాను, నాన్ ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటా 60.96 శాతంగా ఉంది. నిబంధనల ప్రకారం ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటా 40 శాతానికి తగ్గాల్సి ఉంది. షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా బంధన్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రూ. 1 కోటి జరిమానా విధించింది. 



You may be interested

మరో శుభారంభం

Tuesday 5th November 2019

ఏడు ట్రేడింగ్‌ సెషన్లుగా అప్రతిహత ర్యాలీ చేస్తున్న భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం మరో శుభారంభాన్ని చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 40,452 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,975 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. గత రాత్రి అమెరికా ఎస్‌ అండ్‌ పీ500, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ ఇండెక్స్‌లు కొత్త రికార్డుస్థాయిలో ముగియడం, తాజాగా ఆసియా సూచీలు లాభాలతో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో ఇక్కడి షేర్లు

రెండవ దశకు సిద్ధమైన ఐకేపీ

Tuesday 5th November 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న ఐకేపీ నాలెడ్జ్‌ పార్క్‌ రెండో దశకు సిద్ధమైంది. సంస్థ 20వ వార్షికోత్సవాల్లో భాగంగా నవంబరు 8న భవిష్యత్‌ ప్రాణాళికను ప్రకటించనుంది. పరిశోధన రంగంలో విజయవంతమయ్యే కంపెనీల రూపకల్పన సంస్థ ప్రధాన ఉద్ధేశమని ఐకేపీ చైర్మన్‌ దీపాన్విత ఛటోపాధ్యాయ తెలిపారు. సీవోవో ప్రసాద్‌ ఎడె, చీఫ్‌ మేనేజర్‌ డి.విశ్వనాథంతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీలు మేధో సంపత్తి హక్కులను

Most from this category