News


బజాజ్ ఫైనాన్స్ స్వాధీనంలోకి 'కార్వీ డేటా' షేర్లు

Friday 20th December 2019
news_main1576814217.png-30331

న్యూఢిల్లీ: కార్వీ గ్రూప్ సంస్థకి ఇచ్చిన రుణాలు రాబట్టుకునే క్రమంలో కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్ (కేడీఎంఎస్ఎల్) తనఖా ఉంచిన 24 లక్షల షేర్లను స్వాధీనం చేసుకున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఇది కేడీఎంఎస్‌ఎల్‌ పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వాటాకు సమానం. గ్రూప్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) తీసుకున్న రుణాల కోసం కేడీఎంఎస్ఎల్ ఈ షేర్లను తనఖా ఉంచింది. వీటి ముఖ విలువ రూ. 10. 2008లో ఏర్పాటైన కేడీఎంఎస్ఎల్‌ సంస్థ .. ఐటీ సేవలు అందిస్తోంది. 2018-19లో కంపెనీ టర్నోవరు రూ. 1,274 కోట్లు. 



You may be interested

సాంక్టమ్‌ వెల్త్‌ టాప్‌ సిఫార్సులు

Friday 20th December 2019

వచ్చే మూడు నాలుగు వారాలకు మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2070. స్టాప్‌లాస్‌ 1740. జూలైలో వేగంగా పతనమై ఆగస్టు నాటికి రూ.1348 కనిష్ఠానికి వచ్చింది. అక్కడ నుంచి తిరిగి వేగంగా పెరిగి సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్‌ హై రూ. 1898ని తాకింది. ఆపై కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మరలింది. ప్రస్తుతం షేరు ధర కీలక డీఎంఏలకు పైన ఉంది.

పాజిటివ్‌ ప్రారంభం

Friday 20th December 2019

ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల్ని అందిపుచ్చుకున్న భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం ప్రారంభంలోనే మరో కొత్త రికార్డుస్థాయిని అందుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 72 పాయింట్లు జంప్‌చేసి 41,746 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 12,270 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category