News


అంచనాలు దాటిన బజాజ్‌ ఫైనాన్స్‌

Wednesday 29th January 2020
news_main1580294297.png-31309

డిసెంబర్‌ త్రైమాసికానికి బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం 52 శాతం పెరిగి రూ. 1614కోట్లకు చేరింది. బలమైన ఎన్‌ఐఐ, ఏయూఎంతో కంపెనీ మంచి లాభాలు చూపింది. ఈ సమయంలో నికర వడ్డీ ఆదాయం 42 శాతం దూసుకుపోయి రూ. 4537కు చేరింది. కొత్త లోన్స్‌లో వృద్ధి 13 శాతంగా నమోదయింది. కస్టమర్‌ ఫ్రాంచైజీ 24 శాతం మేర పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ లాభం రూ. 1523 కోట్లుంటుందని, ఎన్‌ఐఐ రూ. 3561కోట్లుంటుందని అనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలను కంపెనీ అధిగమించింది. మూడో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 40.6 శాతం పెరిగి రూ. 7011 కోట్లను చేరింది. కంపెనీ ఏయూఎం 35 శాతం వృద్ధితో 1.45 లక్షల కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో స్థూల ఎన్‌పీఏలు ఎలాంటి మార్పు లేకుండా 1.61 శాతం వద్ద ఉండగా, నికర ఎన్‌పీఏలు స్వల్పంగా పెరిగి 0.7 శాతానికి చేరాయి. ఈ కాలంలో రుణ నష్టాలు రూ. 831 కోట్లుకాగా, ప్రొవిజన్లు రూ. 451కోట్లకు చేరాయి. ఫలితాలు అదరగొట్టడంతో షేరు బుధవారం ట్రేడింగ్‌లో దూసుకుపోయి నూతన గరిష్ఠాలను తాకింది. బుధవారం షేరు 5 శాతం పెరిగి రూ. 4426 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 4444 గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

కరోనాకు చెక్‌- సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ

Wednesday 29th January 2020

41,200కు చేరిన సెన్సెక్స్‌  74 పాయింట్లు పెరిగిన నిఫ్టీ  ఎట్టకేలకు కరోనా భయాలకు చెక్‌ పడింది. యాపిల్‌ అండతో మంగళవారం అమెరికా మార్కెట్లు లాభపడగా..  బడ్జెట్‌పై ఆశలతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ చేసింది. వెరసి మళ్లీ 41,000 స్థాయిని అధిగమించింది. 232 పాయింట్లు పెరిగి 41,199 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 74 పాయింట్లు జమ చేసుకుని 12,130 వద్ద స్థిరపడింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు

టాటా మోటర్స్‌ షేరు 7 శాతం జంప్‌

Wednesday 29th January 2020

టాటా మోటర్స్‌ షేరు బుధవారం దాదాపు 7శాతం లాభంతో ముగిసింది. ఎడెల్వీజ్‌ బ్రోకరేజ్‌ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.245లకు పెంచడం ఇందుకు కారణమైంది. అలాగే తన ప్రసిద్ధ కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) నెక్సాన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విభాగంలో ఈ తరహా వాహనాలు అత్యంత చౌకమైనవి కావడంతో రానున్న రోజుల్లో వీటికి మరింత డిమాండ్‌

Most from this category