STOCKS

News


ఇదంతా ప్రభుత్వం నిర్వాకమే..

Tuesday 30th July 2019
news_main1564465789.png-27405

  • డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి
  • వాటికి ఊతమిచ్చేందుకు కేంద్రం చర్యలేమీ తీసుకోవడం లేదు 
  • బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై బజాజ్ ఆటో చైర్మన్‌ రాహుల్ బజాజ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్టుబడులు, డిమాండ్‌కి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఏ విధంగానూ ప్రయత్నించడం లేదని ఆక్షేపించారు. "ప్రభుత్వం చెప్పినా చెప్పకున్నా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు గణాంకాలు చూస్తే గడిచిన మూడు-నాలుగేళ్లుగా వృద్ధి క్షీణిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం మాత్రం అంతా బాగానే ఉందని చూపే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులను ఒప్పుకోక తప్పదు. డిమాండ్‌ లేదు. ప్రైవేట్ పెట్టుబడులు లేవు. మరింక వృద్ధి ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదుగా. ఆటో పరిశ్రమకు చాలా కష్టకాలంగా ఉంది. కార్లు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు.. ఇలా అన్ని విభాగాలూ తీవ్ర సమస్యల్లో ఉన్నాయి" అని కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా రాహుల్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ విక్రయాలు 12.3 శాతం క్షీణించాయి. కార్లు, ఎస్‌యూవీలు, వాన్స్‌కి సంబంధించిన పాసింజర్ వాహనాల విభాగం ఏకంగా 18.4 శాతం తగ్గింది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ తదితర దిగ్గజ సంస్థలన్నీ కూడా ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. అయినప్పటికీ అమ్మకాలు సరిగ్గా లేక గిడ్డంగులు, డీలర్ల దగ్గర ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాల నిల్వలు భారీగా పేరుకుపోయి ఉన్నాయి. సాధారణంగా డీలర్ల దగ్గర 25-30 రోజులకు సరిపడేంత నిల్వలు ఉంటాయి. కానీ ప్రస్తుతం 65 రోజుల స్థాయికి నిల్వలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.You may be interested

వెలుగులోకి మాల్యా కొత్త షెల్‌ కంపెనీలు

Tuesday 30th July 2019

అక్రమంగా నిధుల మళ్లింపు కేసులో ఈడీ గుర్తింపు అనుచరుడి ఇంట్లో సోదాలు న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్‌ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్‌) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్‌ కంపెనీలను(యునైటెడ్‌ బ్రాండింగ్‌ వరల్డ్‌వైడ్‌

వ్యక్తిగత దివాలా నియంత్రణ దశలవారీగా...

Tuesday 30th July 2019

దివాలా కంపెనీలను కొన్న వాటిపై క్రిమినల్‌ చర్యలు ఉండవు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ఐబీసీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం న్యూఢిల్లీ: మూడేళ్ల నాటి ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) చట్టంలో ప్రభుత్వం సవరణలు ప్రతిపాదించగా, ఇందుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. నిర్వహణ అవసరాలకు రుణాలిచ్చిన సంస్థల (అపరేషనల్‌ క్రెడిటార్స్‌)తో పోలిస్తే, సెక్యూర్డ్‌ రుణాలిచ్చిన వాటికి ప్రాధాన్యంపై తాజా సవరణలతో స్పష్టత రానుంది. దివాలా కంపెనీని ఒడ్డెక్కించేందుకు దాన్ని

Most from this category