News


నాలుగు రెట్లు పెరిగిన బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం

Friday 24th May 2019
news_main1558684495.png-25915

  • 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు మొత్తం ఆదాయం
  • ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19)మార్చి క్వార్టర్‌లో నాలుగు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.29 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,606 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ శేఖర్‌ బజాజ్‌ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,496 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,755 కోట్లకు పెరిగాయని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. స్థూల లాభంలో ఎలాంటి వృద్ధి లేదని నిర్వహణ లాభం రూ.38 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు పెరిగిందని వివరించారు. 

రెట్టింపైన ఏడాది లాభం....
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరిగి రూ.167 కోట్లకు పెరిగిందని శేఖర్‌ బజాజ్‌ చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.4,716 కోట్ల నుంచి 41 శాతం పెరిగి రూ.6,673 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రాజీవ్‌ బజాజ్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. 



You may be interested

బ్యాంకు నిఫ్టీ 2.50 శాతం ర్యాలీ

Friday 24th May 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం భారీ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకిం‍గ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంకు నేడు 2శాతం పెరిగింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,685.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ ఇండెక్స్‌ 2.50శాతం(771 పాయింట్లు) పెరిగి 31180.25ల వద్ద ఇంట్రాడే వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఇండెక్స్‌లో బ్యాంక్‌

హెరిటేజ్‌ లాభం రూ.20 కోట్లు

Friday 24th May 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం రూ.20 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.19.8 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసికం లెక్కన టర్నోవరు రూ.614 కోట్ల నుంచి రూ.706 కోట్లకు పెరిగింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూస్తే లాభం 30 శాతం వృద్ధితో రూ.82 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.2,776 కోట్ల నుంచి రూ.2,655 కోట్లకు తగ్గింది.

Most from this category