News


బజాజ్‌ కన్సూమర్‌ లాభం 9 శాతం అప్‌

Tuesday 16th July 2019
news_main1563260199.png-27095

  • 10 శాతం పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీ బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.57 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సంరలో ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.52 కోట్లుతో పోల్చితే 9 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.224 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.247 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 

 బజాజ్‌ కన్సూమర్‌ కేర్‌ కంపెనీ కేశ సంరక్షణ విభాగంలో పలు ఉత్పత్తులను అందిస్తోంది. బజాజ్‌ అల్మండ్‌ డ్రాప్స్‌, బజాజ్‌ కైలాశ్‌ పర్బత్‌, బజాజ్‌ బ్రహ్మి అమ్ల తదితర ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తోంది. ఓజోన్‌ ఆయుర్వేదిక్స్‌కు చెందిన నోమార్క్స్‌ బ్రాండ్‌ను 2013, ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా చర్మ సంరక్షణ విభాగంలోకి అడుగిడింది. 



You may be interested

ప్రత్యేక కంపెనీగా గెయిల్‌ పైప్‌లైన్‌ విభాగం !

Tuesday 16th July 2019

కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్‌ సంస్థ, గెయిల్‌ (ఇండియా)ను విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గెయిల్‌ కంపెనీ పైప్‌లైన్‌ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని, ఈ విభాగాన్ని వ్యూహాత్మక ఇన్వెస్టర్‌కు విక్రయించనున్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐఓసీ, బీపీసీఎల్‌ల ఆసక్తి... దేశంలోనే అతి పెద్ద నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌, ట్రేడింగ్‌ కంపెనీగా గెయిల్‌ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశంలోని 16,234  కిమీ. గ్యాస్‌పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌లో మూడింట రెండొంతులు ఈ కంపెనీదే.

ఆర్థిక మందగమనానికి ఆనవాలు!

Tuesday 16th July 2019

జూన్‌లో ఎగుమతులు, దిగుమతుల క్షీణత  9.71 శాతం క్షీణించిన ఎగుమతులు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ  నిరాశాకర పరిస్థితి దిగుమతులూ మైనస్‌లోనే వృద్ధిలేకపోగా 9 శాతం క్షీణత 15.28 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని  జూన్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... -  ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71 శాతం క్షీణించాయి.

Most from this category