News


బజాజ్‌ ఆటో లాభం రూ.1,322 కోట్లు

Friday 31st January 2020
news_main1580440803.png-31350

(అప్‌డేటెడ్‌...)

  • 8 శాతం వృద్ధి 
  • రూ.7,640 కోట్లకు పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం, బజాజ్‌ ఆటో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 8 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.1,221 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,322 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,436 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.7,640 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ముడి పదార్థాల ధరలు తగ్గడం, వాహనాల ధరల పెంపు, కరెన్సీ మారకం ప్రయోజనాల కారణంగా నిర్వహణ లాభ మార్జిన్‌ మెరుగుపడిందని వివరించింది. మరిన్ని వివరాలు..


నిర్వహణ లాభం 13 శాతం వృద్ధి...
పన్ను వ్యయాలు రూ.457 కోట్ల నుంచి రూ.410 కోట్లకు తగ్గాయి. స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, ఈ క్యూ3లో నికర లాభం 15 శాతం వృద్ధితో ర.1,262 కోట్లకు, ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.7,640 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 13 శాతం వృద్ధితో రూ.1,406 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్‌ 1.5 శాతం వృద్ధితో 8.4 శాతానికి పెరిగింది. గత క్యూ3లో రూ.15,986 కోట్లుగా ఉన్న నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.17,407 కోట్లకు పెరిగాయి. 
రికార్డ్‌ స్థాయి ఎగుమతులు....
గత క్యూ3లో 12.6 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు ఈ క్యూ3లో 5 శాతం తగ్గి 12 లక్షలకు చేరాయి. బైక్‌ల అమ్మకాలు 5 శాతం, వాణిజ్య వాహన విక్రయాలు 3 శాతం చొప్పున తగ్గగా, ఎగుమతులు మాత్రం 7 శాతం వృద్ధితో 5.6 లక్షలకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక త్రైమాసిక ఎగుమతులు. 

ఈసీ పదవి నుంచి వైదొలుగుతున్న రాహుల్‌ బజాజ్‌ 
ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పదవి నుంచి రాహుల్‌ బజాజ్‌ వైదొలుగుతున్నారు. ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన పదవీ కాలం ఈ ఏడాది మార్చి 31 వరకూ ఉంది. 1970 నుంచి కంపెనీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు కావడంతో సెబీ నిబంధనల ప్రకారం నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఆయన నియామకానికి ప్రత్యేక తీర్మానం ద్వారా వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్ర పట్టభద్రుడైన రాహుల్‌  బజాజ్‌ హార్వర్డ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ చదివారు. 2006-10 కాలానికి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 



You may be interested

నేడు సానుకూల ఓపెనింగ్‌ ?!

Friday 31st January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 36 పాయింట్లు ప్లస్‌ లాభా‍ల్లో అమెరికా, ఆసియా మార్కెట్లు నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 36 పాయింట్లు పుంజుకుని 12,082  వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,046 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌

నేడు, రేపు బ్యాంకుల బంద్‌

Friday 31st January 2020

వేతనాలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా నేడు, రేపు (శుక్ర, శనివారం) బ్యాంక్‌ ఉద్యోగులు, అధికారులు సమ్మె చేయనున్నారు. ఈ రెండు రోజులు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు సాగవని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఒక ప్రకటనలో తెలిపింది. 20 శాతం వేతనాల పెంపు, ఐదు రోజుల పనిదినాలు, ఎన్‌పీఎస్‌ తొలగింపు వంటి 11 డిమాండ్లతో కార్మిక శాఖ, కేంద్రంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని..

Most from this category