News


బజాజ్‌ ఆటో లాభం రూ.1,523 కోట్లు

Thursday 24th October 2019
news_main1571888169.png-29097

  • 21 శాతం వృద్ధి 
  • 4 శాతం తగ్గిన మొత్తం ఆదాయం 
  • అమ్మకాలు 12 శాతం డౌన్‌ 


న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,523 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.1,257 కోట్లు)తో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని బజాజ్‌ ఆటో తెలిపింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం కారణంగా రూ.182 కోట్ల పన్ను ఆదా కావడం  కలసి వచ్చిందని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,036 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.7,707 కోట్లకు చేరిందని పేర్కొంది. పన్నులు, డివిడెండ్లు కలిసి మొత్తం రూ.2,072 కోట్ల చెల్లింపులు పోను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,986 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. 

12 శాతం తగ్గిన వాహన విక్రయాలు...
గత క్యూ2లో 13.4 లక్షలుగా ఉన్న మొత్తం వాహన విక్రయాలు ఈ క్యూ2లో 11.73 లక్షలకు తగ్గాయని బజాజ్‌ ఆటో తెలిపింది. మోటార్‌ బైక్‌ల విక్రయాలు 11.26 లక్షల నుంచి 12 శాతం తగ్గి 9.84 లక్షలకు తగ్గాయని పేర్కొంది. వాణిజ్య వాహన విక్రయాలు 2.12 లక్షల నుంచి 11 శాతం క్షీణించి 1.89 లక్షలకు తగ్గాయని వివరించింది. బైక్‌లకు సంబంధించి దేశీయ అమ్మకాలు 25 శాతం తగ్గాయని తెలిపింది. బైక్‌ల ఎగుమతులు మాత్రం 4.33 లక్షల నుంచి 7 శాతం పెరిగి 4.62 లక్షలకు చేరాయని పేర్కొంది. 



You may be interested

6.1 నుంచి 7 శాతానికి వృద్ధిరేటు

Thursday 24th October 2019

భారత్‌పై ఐఎంఎఫ్‌ అంచనా సింగపూర్‌: భారత్‌ ఆర్థిక వృద్ధిరేటు 2020-2021లో కొంత మెరుగుపడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆసియా పసిఫిక్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జోనథన్‌ ఆస్రా‍్టయ్‌ విశ్లేషించారు. ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2019-20లో భారత్‌ వృద్ధి రేటు కేవలం 6.1 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు. 2020-21లో ఇది 7 శాతానికి మెరుగుపడుతుందన్నది ఐఎంఎఫ్‌ అంచనా అని తెలిపారు. ఒకపక్క కేంద్రం తీసుకున్న కార్పొరేట్‌ పన్ను కోత నిర్ణయం,

‘హీరో’ లాభం 10 శాతం డౌన్‌

Thursday 24th October 2019

రూ.884 కోట్లకు తగ్గిన నికర లాభం  21 శాతం తగ్గిన విక్రయాలు  త్వరలో బీఎస్‌-సిక్స్‌ బైక్‌లు  న్యూఢిల్లీ: టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ

Most from this category