News


మార్కెట్లోకి బజాజ్‌ బీఎస్‌-6 వాహనాలు

Tuesday 28th January 2020
news_main1580208650.png-31276

100, 110 సీసీల్లో సీటీ, ప్లాటినా మోడళ్లు
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ మంగళవారం జీఎస్‌-6 వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్ర సూచించిన బీఎస్‌-6 నిబంధనలకు అనుగుణంగా బజాజ్‌ సీటీ, ప్లాటినా మోడల్‌ బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్‌ ఇంజెక్షన్‌(ఈఐ) వ్యవస్థను ఆమర్చిన ఈ బైక్‌ల  ప్రారంభ ధరను రూ.40,794గా నిర్ణయించారు. ఈఐ వ్యవస్థ వల్ల ఇంజిన్‌ స్మూత్‌గా నడవడమేగాక , మైలేజీని బాగా ఇస్తుందని కంపెనీ తెలిపింది. కాగా సీటీ బీఎస్‌-6 మోడల్‌ బైక్‌ 100, 110 సీసీ ఇంజిన్లు కలిగి ఉండడంతో దాని ప్రారంభధరను  రూ.40,794 ప్రకటించారు. ప్లాటినా బీఎస్‌-6 మోడల్‌లో 100, 110 సీసీలేగాక హెచ్‌ గేర్‌ ఉండడం వల్ల దాని ప్రారంభ ధరను రూ.47,264 గా నిర్ణయించారు. మరికొద్ది వారాల్లో ఇతర రకాల మోడళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది.
 You may be interested

మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ

Tuesday 28th January 2020

మార్కెట్లోకి టాటా నెక్సాన్‌ ఈవీ ప్రారంభ ధర రూ.13.99 లక్షలు ముంబై: పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంటుతో నడిచే వాహనాలు అందుబాటులోకి తెచ్చేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌  కార్‌ ‘నెక్సాన్‌ ఈవీ’ని మంగళవారం మార్కెట్‌లో విడుదల చేసింది. జిపట్రాన్‌ టెక్నాలజీ కలిగిన ఈ కారు ఒక్కసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంతేగాక ఇందులో 35 కనెక్టెడ్‌

ఇప్పుడు కొంటే బడ్జెట్‌ తర్వాత లాభాలే!

Tuesday 28th January 2020

గత గణాంకాల విశ్లేషణతో నిపుణుల సూచన సాధారణంగా ప్రతి బడ్జెట్‌ సమయంలో మార్కెట్‌ వర్గాల్లో ఆశలు, అంచనాలు అధికంగా ఉంటాయి. ఈ దఫా కూడా బడ్జెట్‌పై బోలెడు అంచనాలు, ఆశలు ఉన్నాయి, కానీ గతంతో పోలిస్తే తక్కువనే నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్‌ ముందు వారం మార్కెట్లు స్తబ్దుగా ఉండడం ఎక్కువసార్లు జరిగినట్లు గత గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ దఫా మార్కెట్లు ప్రీబడ్జెట్‌ వారంలో నెగిటివ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌

Most from this category