News


సిటీ బ్యాంకుతో బజాజ్‌ అలయంజ్‌ భాగస్వామ్యం

Wednesday 19th June 2019
news_main1560926968.png-26410

పుణె: బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, సిటీ బ్యాంకు మధ్య కార్పొరేట్‌ ఏజెన్సీ ఒప్పందం కుదిరింది. బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌కు చెందిన బీమా ఉత్పత్తులను సిటీ బ్యాంకు తన శాఖల ద్వారా పంపిణీ చేయనుంది. వైద్య, వ్యక్తిగత ప్రమాద, వాహన, గృహ, పర్యాటక బీమా పాలసీలను సిటీ బ్యాంకు కస్టమర్లకు బజాజ్‌ అలయంజ్‌ ఆఫర్‌ చేయనుంది. దేశంలో ప్రతీ పౌరుడికీ చేరటంతో పాటు వారికి అనువైన బీమా ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని బజాజ్‌ అలయంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో తపన్‌ సింఘాల్‌ తెలిపారు.



You may be interested

వాట్సాప్‌ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక

Wednesday 19th June 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలోని క్లిష్టమైన సమస్యలను టెక్నాలజీ ద్వారా పరిష్కరించేందుకు ఉద్దేశించిన వాట్సాప్‌ ఇండియా చాలెంజ్‌లో ఐదు స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. ఒక్కో స్టార్టప్‌కు రూ.35 లక్షలు (50 వేల డాలర్లు) ఫండింగ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఎంపికైన స్టార్టప్స్‌.. డిజిటల్‌ హెల్త్‌కేర్‌ మెడ్‌కార్డ్స్, వర్చువల్‌ రియాలిటీ కంటెంట్‌ మెల్జో, వాట్స్‌అప్‌ ఆధారిత ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ జావీస్, అగ్రిటెక్‌ గ్రామోఫోన్, రియల్‌ టైమ్‌ ఎలక్రిసిటీ లెవల్‌ మినీ ఆన్‌ ల్యాబ్స్‌.

బడ్జెట్‌పై ట్విట్టర్ క్విజ్ ప్రారంభించిన ఆర్థిక శాఖ

Wednesday 19th June 2019

న్యూఢిల్లీ: బడ్జెట్‌పై ప్రజల్లో ఆసక్తిని పెంచడంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై క్విజ్‌ సిరీస్‌ను ప్రారంభించింది. ట్విట్టర్ వేదికగా మొదలైన ఈ క్విజ్‌లో మొత్తం నాలుగు మల్టీపుల్‌ ఆప్షన్లతో మంగళవారం తొలి ప్రశ్నను సంధించింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ బడ్జెట్ ఎప్పుడు సమర్పించారనే ప్రశ్నను వేసింది. బడ్జెట్‌కు సంబంధించిన జ్ఞానాన్ని ప్రజలు మరోసారి మననం చేసుకోవడానికి ఇది సరైన వేదికగా భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఈ

Most from this category