News


ప్రభుత్వ బ్యాంకింగ్‌పై తగ్గుతున్న ‘మొండి’ భారం

Tuesday 11th February 2020
news_main1581390867.png-31672

  • లోక్‌సభలో ఆర్థికమంత్రి ప్రకటన
  • 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు
  • 2019 సెప్టెంబర్‌లో రూ.7.27 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్‌ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్‌ రంగ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని అన్నారు. బ్యాంకింగ్‌లో పాలనా వ్యవస్థ మెరుగుదల, పర్యవేక్షణ, రికవరీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆమె ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...

- సెప్టెంబర్‌ 2019తో ముగిసిన ఏడాదిన్నర కాలంలో దాదాపు రూ.2.03 లక్షల కోట్ల రికార్డు స్థాయిలో రికవరీ జరిగింది. 
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మొత్తం 18 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12 లాభాలను నమోదుచేసుకున్నాయి.
- ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో (మొండిబకాయిలకు కేటాయింపుల నిష్పత్తి) కేటాయింపులు జరిగాయి. 
- బ్యాంకింగ్‌ వ్యవస్థ కుదుటపడుతోందని డిసెంబర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రచురించిన బ్యాంకింగ్‌ ట్రెండ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. అలాగే 2019 మార్చిలో 14.3 శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల క్యాపిటల్‌ అడిక్వసీ రేషియో 2019 సెప్టెంబర్‌ నాటికి 15.1 శాతానికి పెరిగింది. 
- రియల్టీ, ఎన్‌బీఎఫ్‌సీలుసహా వివిధ విభాగాల్లో మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి దివాలా పరిష్కార పక్రియసహా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. 
- రుణ చెల్లింపుల్లో వైఫల్యం, మోసాలు, ద్రవ్య లభ్యత వంటి సవాళ్ల నేపథ్యంలో తాజా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు కొంత సంశయించిన విషయం వాస్తవం. అయితే ఈ సవాళ్ల పరిష్కారం దిశలో తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆర్‌బీఐ ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా ద్రవ్య లభ్యత పరిస్థితుల మెరుగుదల, నిలిచిపోయిన హౌసింగ్‌, రియల్టీ ప్రాజెక్టులకు ద్రవ్య లభ్యత పెరిగేలా చూడ్డం, మోసాల నివారణకు తగిన చట్టపరమైన చర్యలు చేపట్టడం వంటివి ఇందులో ఉన్నాయి.


పారిశ్రామిక ప్రతినిధులతో భేటీ: పరోక్ష పన్ను వివాదాలపై సమీక్ష
ఇదిలావుండగా, ఆర్థికమంత్రి సోమవారం పారిశ్రామిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రతిపాదిత పరోక్ష పన్ను వివాద పరిష్కార పథకంపై వారితో చర్చించారు. పన్ను బకాయిల చెల్లింపు, ఇందుకు సంబంధించి వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు వంటి అంశాలు ఈ పథకంలో ప్రత్యేకతలు. దాదాపు రూ. 9 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఆయా వివాదాల పరిష్కార లక్ష్యంగా లోక్‌సభలో ప్రభుత్వం గత వారం ‘‘డైరెక్ట్‌ ట్యాక్స్‌ వివాద్‌ సే విశ్వాస్‌ బిల్లు, 2020’’ని ప్రవేశపెట్టింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత నోటిఫై అవుతుంది. సోమవారంనాడు జరిగిన సమావేశంలో ఈ బిల్లుపై పారిశ్రామిక వర్గాలు తమ సూచనలు, సలహాలు ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.   



You may be interested

విదేశీ సైట్లలో కొంటే ఇక బాదుడే..

Tuesday 11th February 2020

(అప్‌డేటెడ్‌..!) ప్రీపెయిడ్‌ కస్టమ్స్‌ డ్యూటీ, ట్యాక్స్‌ విధింపు ప్రతిపాదన సుంకాల ఎగవేతను అరికట్టేందుకే దాదాపు 50 శాతం పెరగనున్న భారం న్యూఢిల్లీ: విదేశీ ఈ-కామర్స్‌ సైట్లలో జరిపే కొనుగోళ్లు ఇకపై భారం కానున్నాయి. ఈ షాపింగ్‌ పోర్టల్స్‌లో లావాదేవీల్లో సుంకాలు, పన్నుల ఎగవేత ఉదంతాలు చోటు చేసుకుంటుండటంపై కేంద్రం మరింతగా దృష్టి సారించడమే ఇందుకు కారణం. సీమాంతర లావాదేవీలపై ప్రీ–పెయిడ్‌ విధానంలో కస్టమ్స్‌ సుంకాలు, పన్నులను వడ్డించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విధానం అమల్లోకి

25 శాతం తగ్గిన గెయిల్‌ నికర లాభం

Tuesday 11th February 2020

న్యూఢిల్లీ: గెయిల్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్‌లో 25 శాతం తగ్గింది. సహజ వాయువు, ఎల్‌పీజీ, లిక్విడ్‌ హైడ్రోకార్బన్ల మార్కెటింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో రూ.1,250 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరు వారీ ఆర్జన రూ.2.77గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.1,681 కోట్లుగా ఉండడం గమనార్హం. సహజ వాయువు మార్కెటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం 9.5 శాతం తగ్గి రూ.14,663 కోట్లుగా ఉంది.

Most from this category