STOCKS

News


బ్యాంకుల నెత్తిన రూ. 30వేల కోట్ల భారం!

Friday 3rd January 2020
news_main1578031674.png-30646

పెరగనున్న మొండిపద్దుల కేటాయింపులు
కొత్త ఏడాదిని దేశీయ బ్యాంకులు దాదాపు రూ. 30వేల కోట్ల ప్రొవిజన్ల కేటాయింపుతో ఆరంభించనున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ అనీల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు, సీసీడీ, సీజీ పవర్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించి బ్యాంకులు ఈ మొత్తాన్ని తమ పద్దు పుస్తకాల్లో కేటాయించాల్సిఉంటుంది. వీటిలో ఏ అకౌంట్‌కు సంబంధించి ఇంతవరకు సెటిల్‌మెంట్‌ జరగలేదు. దీంతో డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకుల ప్రొవిజనింగ్స్‌ పెరగనున్నాయి. ఈ కేటాయింపుల్లో అధికభాగం డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రుణాలకు సంబంధించి ఉంటాయని అంచనా. ఒక కంపెనీకి ఇచ్చిన రుణం తిరిగి రానప్పుడు దానిని ఎన్‌సీఎల్‌టీకి రిఫర్‌ చేస్తారు. ఇలా రిఫర్‌ చేసిన అకౌంట్లకు సంబంధించి 40 శాతం మొత్తాన్ని ప్రొవిజనింగ్‌ చేయాలని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు బ్యాంకులు, ఇతర విత్త సంస్థలు అన్నీ కలిపి దాదాపు రూ. 87వేల కోట్ల రుణాలిచ్చాయి. బ్యాంకులు ఈ రుణాలకు సంబంధించి కేవలం 10- 15 శాతం నిధులనే ఇప్పటివరకు తమ ఫలితాల్లో కేటాయిస్తూ వచ్చాయి. ఇక ఆర్‌ హోమ్‌ ఫైనాన్స్‌కు రూ. 5వేల కోట్లు, సీసీడీకి రూ. 4970 కోట్లు, సీజీ పవర్‌కు రూ. 4000 కోట్ల చొప్పున బ్యాంకులు రుణాలిచ్చాయి. వీటన్నింటికి డిసెంబర్‌, మార్చి త్రైమాసికాల్లో తప్పక ప్రొవిజన్స్‌ పెంచాల్సిఉంది. దీనివల్ల బ్యాంకుల ఫలితాల్లో ప్రొవిజన్ల భారం మరింత పెరగనుంది.

త్వరలో వొడాఫోన్‌ ఐడియాకు సంబంధించి బ్యాంకులు భారం మోయాల్సి వచ్చేలా పరిస్థితులు పరిణమిస్తున్నాయి. ప్రభుత్వ సాయం అందకుంటే ఇవ్వాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేమని ఇటీవలే వీఐఎల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించడం గమనార్హం. ఒకవేళ కంపెనీ బకాయిల వసూలుకు టెలికం శాఖ బ్యాంకు గ్యారెంటీల మద్దతు కోరితే పరిస్థితి సంక్లిష్టంగా మారవచ్చని నిపుణుల అంచనా. వీఐఎల్‌కు ఒక్క ఎస్‌బీఐ రూ. 12వేల కోట్ల రుణాలిచ్చింది. వీఐఎల్‌ నెత్తిన మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల రుణభారం ఉంది. ఇటీవలే ఎస్సార్‌స్టీల్‌కు సంబంధించి ఎస్‌బీఐ రికవరీలు పొందింది. కానీ ఈ మొత్తమంతా తాజా ప్రొవిజనింగ్‌లకే సరిపోవచ్చని బ్యాంకు ఉన్నతాధికారులు వాపోతున్నారు. You may be interested

ఇకపై మెటల్‌ షేర్లకు డిమాండ్‌?

Friday 3rd January 2020

సాధారణంగా వర్ధమాన మార్కెట్లకూ, కమోడిటీలకు పటిష్ట బంధం ఉంటుంది. ఇవి ఒకే విధమైన కదలికలకు లోనవుతుంటాయి. వెరసి ఇకపై అటు వర్ధమాన స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు మెటల్‌ కౌంటర్లు జోరు చూపే వీలున్నదంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు! బుల్‌ ట్రెండ్‌, సాంకేతిక అంశాలు.. తదితర పలు విషయాలపై విశ్లేషకుల స్పందన తీరిలా.. బుల్‌ జోరు చూపే మార్కెట్లలో ప్రతిసారీ చోటుచేసుకునే దిద్దుబాట్లు(కరెక్షన్లు) ర్యాలీ బలాన్ని ప్రతిబింబిస్తాయి. 2019 ఆగస్ట్‌ తదుపరి వచ్చిన కరెక్షన్లు స్వల్ప

బ్యాంక్‌ నిఫ్టీ డౌన్‌

Friday 3rd January 2020

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీరసంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు వెనకడుగులో కదులుతున్నాయి. గురువారం రాత్రి బాగ్దాద్‌పై అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌ అధికారులు కొంతమంది మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు రివ్వుమన్నాయి. దీంతో దేశీయంగా చమురు దిగుమతుల బిల్లు పెరగనుందన్న అంచనాలు పెరిగి రూపాయి డీలాపడింది. దీనికితోడు ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను ప్రభుత్వం చేరకపోవచ్చన్న

Most from this category