News


రుణాల విషయంలో జాగ్రత్తగా ఉంటాం

Friday 12th July 2019
news_main1562914368.png-27007

  • కొన్ని విభాగాల్లో కొత్త సమస్యలు
  • యాక్సిస్‌ బ్యాంకు ఎండీ చౌదరి

ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొత్త సమస్యలు కనిపిస్తున్నాయని, దీంతో రుణాల పంపిణీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు యాక్సిస్‌ బ్యాంకు ఎండీ అమితాబ్‌ చౌదరి అన్నారు. ఒకవైపు అధిక ఎన్‌పీఏల సమస్య నుంచి బ్యాంకులు బయటపడుతూ, రుణాల జారీ నిదానించిన సమయంలోనే ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ఆర్థిక రంగంలో ఏర్పడుతున్న పరిణామాలతో ఒత్తిళ్లకు సంబంధించి కొత్త సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో మేము జాగ్రత్తగా ఉన్నాం’’ అని అమితాబ్‌ చౌదరి ముంబైలో మీడియాతో అన్నారు. కొత్త విభాగాల్లో ఒత్తిళ్ల గురించి చౌదరి మాట్లాడుతూ... రియల్‌ ఎస్టేట్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) ఈ రెండు విభాగాలు తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు. అయితే, వీటిల్లో చాలా కంపెనీలు మంచి స్థితిలోనే ఉన్నట్టు ఆ వెంటనే ఆయన పేర్కొన్నారు. ‘‘మేం మరీ రిస్క్‌ చేయదలుచుకోవడం (కన్జర్వేటివ్‌) లేదు. మా రిస్క్‌ నిర్వహణ విధానాలు సరిగ్గా ఉండాలనుకుంటున్నాం’’ అని చౌదరి వివరించారు. అయితే, యాక్సిస్‌ బ్యాంకు తన ప్రధాన వ్యాపారమైన రిస్క్‌ తీసుకుని, రుణాలను ఇవ్వడాన్ని బాగా తగ్గించుకుంటుందని భావించొద్దంటూ స్పష్టతనిచ్చారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ... ఏడాది అవుతున్నా ఇంత వరకు పరిష్కారం లభించలేదని, కొన్ని కంపెనీలు మంచిగానే పనిచేస్తున్నందున ఈ విషయంలో సూక్ష్మ పరిశీలన అవసరమన్నారు. ఇది వ్యవస్థాపరమైన అంశంగా మారుతుందని తాను భావించడం లేదని, ఇబ్బందులను అధిగమించేందుకు వ్యవస్థకు సమయం పడుతుందన్నారు. కొన్ని కంపెనీలకు త్వరితంగా ఈక్విటీ నిధుల అవసరం ఉందని పేర్కొన్నారు. బ్యాంకు సొంతంగా రుణాల జారీకే ప్రాధాన్యమిస్తుందని, అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీ పోర్ట్‌ఫోలియో కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తుందని చెప్పారు. You may be interested

రుణ ప్రణాళికకు బ్యాంకర్లు ఓకే

Friday 12th July 2019

రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడి ముంబై: దాదాపు రూ. 7,500 కోట్ల రుణాల పరిష్కార ప్రణాళికకు రుణదాతలు ఆమోదం తెలిపినట్లు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్‌-క్రెడిటార్ ఒప్పందంపై (ఐసీఏ) రుణాలిచ్చిన మొత్తం 16 సంస్థలు సంతకాలు చేసినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ కొత్త సర్క్యులర్‌ ప్రకారం రుణగ్రహీత ఏ ఒక్క బ్యాంకుకైనా డిఫాల్ట్ అయిన పక్షంలో 30 రోజుల్లోగా మిగతా రుణదాతలు సదరు ఖాతాను సమీక్షించాల్సి ఉంటుంది.

ఆప్టికల్‌ ఫైబర్‌కు భారీ డిమాండ్‌

Friday 12th July 2019

5జీ సేవలకు కీలకమైన ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ 2022 నాటికి 4 రెట్లు పెరగాలి రూ. 1,80,000 కోట్ల పెట్టుబడులు కావాలి న్యూఢిల్లీ: హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించే 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కీలకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ (ఓఎఫ్‌సీ)కు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది. టెలికం శాఖ అంచనాల ప్రకారం 2018లో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్‌ సుమారు 1.4–1.5 మిలియన్‌ కేబుల్‌ రూట్‌ కిలోమీటర్స్‌ మేర విస్తరించి ఉంది. ఇంటర్నెట్‌ విస్తృతిని మరింత పెంచే దిశగా ప్రభుత్వం

Most from this category