News


దయచేసి బ్యాంకులకు రాకండి: యాక్సిస్‌ బ్యాంక్‌

Friday 20th March 2020
news_main1584677478.png-32589

కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కోసం బ్యాంకు శాఖలను సందర్శించడం వీలైనంత మేర తగ్గించివేయాలని యాక్సిస్‌ బ్యాంక్‌ తమ కస్టమర్లకు సూచించింది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌లను వినియోగించుకుని అందరం సమిష్టిగా కరోనాను ఎదుర్కొందామని బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్ చౌదరి తమ కస్టమర్లకు ఈ-మెయిల్స్‌ పంపారు. ఉద్యోగుల రక్షణ కోసం అన్ని శాఖల్లో ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. 



You may be interested

బోర్డ్‌ మీటింగ్స్‌ వీడియోలో..

Friday 20th March 2020

కరోనా నేపథ్యంలో 3 నెలలు వెసులుబాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీల బోర్డ్‌ మీటింగ్స్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించే వీలు కల్పించింది కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ). దీంతో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, అమాల్గమేషన్, నిధుల సమీకరం వంటి కీలక నిర్ణయాల బోర్డ్‌ మీటింగ్స్‌లను వీడియో లేదా ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించుకోవచ్చు. జూన్‌ 30 వరకు వీడియో, ఆడియో ద్వారా సమావేశాలకు అనుమతి ఇస్తున్నట్టు సౌతీస్ట్‌ రీజియన్‌ రీజినల్‌ డైరెక్టర్‌

డిజిటల్‌ చెల్లింపుల చార్జీలను ఎత్తివేసిన బీఓబీ

Friday 20th March 2020

కరోనా (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తమ వంతు పాత్రగా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వెల్లడించింది. ఇందులో భాగంగా ‘స్టే సేఫ్‌, బ్యాంక్‌ సేఫ్‌’ పేరిట స్కీంను గురువారం ప్రకటించింది. కస్టమర్లు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌ చెల్లింపులపై మూడు నెలలపాటు చార్జీలను ఎత్తివేసినట్లు వివరించింది. 

Most from this category