News


యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ.1,757 కోట్లు

Thursday 23rd January 2020
news_main1579747962.png-31111

  • 5 శాతం వృద్ధి 
  • రూ.19,495 కోట్లకు మొత్తం ఆదాయం

ముంబై: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో రూ.1,757 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,681 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించామని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.18,130 కోట్ల నుంచి రూ.19,495 కోట్లకు పెరిగింది.
పెరిగిన తాజా మొండి బకాయిలు...
ఈ క్యూ3లో నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్థితో రూ.6,453 కోట్లకు చేరుకుంది. గత క్యూ3లో 5.75 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 2.36 శాతం నుంచి 2.09 శాతానికి చేరాయి. విలువ పరంగా చూస్తే స్థూల మొండి బకాయిలు రూ.30,855 కోట్ల నుంచి రూ.30,073 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.12,233 కోట్ల నుంచి రూ.12,160 కోట్లకు తగ్గాయి. అయితే ఈ క్యూ3లో తాజా మొండి బకాయిలు మాత్రం రూ.3,746 కోట్ల నుంచి రూ.6,214 కోట్లకు పెరగటం గమనార్హం. 



You may be interested

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం 69 శాతం డౌన్‌

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది.  నికర వడ్డీ

జెఫరీస్‌​ మిడ్‌క్యాప్‌ జాబితా ఇదే..

Wednesday 22nd January 2020

గతేడాది నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీలతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు పోటీపడలేకపోయాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేసి అధిక వ్యాల్యూషన్లకు చేరినందున ఈ ఏడాది (2020లో) మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ ఉంటుందని కొంత మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. మిడ్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన ‍స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు ఉందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు జెఫరీస్‌ అంటోంది.   మిడ్‌క్యాప్‌ విభాగంలో సుప్రీమ్‌ ఇండస్ట్రీస్‌, కజారియా సిరామిక్స్‌, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌ను టాప్‌ పిక్స్‌గా జెఫరీస్‌ పేర్కొంది.

Most from this category