News


యాక్సిస్ లాభం రెట్టింపు

Wednesday 30th January 2019
news_main1548820985.png-23883

  • యాక్సిస్ లాభం రెట్టింపు
  • మూడో త్రైమాసికంలో రూ. 1,681 కోట్లు
  • పెరిగిన స్థూల ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 14,315 కోట్ల నుంచి రూ. 18,130 కోట్లకు ఎగిసినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు, స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏ) 5.28 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 2.56 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 25,001 కోట్ల నుంచి రూ. 30, 855 కోట్లకు పెరిగాయి. నికర ఎన్‌పీఏలు రూ. 11,769 కోట్ల నుంచి రూ. 12,233 కోట్లకు చేరాయి. క్యూ3లో రుణాల వృద్ధి 18 శాతం పెరగ్గా.. రిటైల్ రుణాల విభాగం 20 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 49 శాతంగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.



You may be interested

బ్యాంకింగ్‌ షేర్ల జోరు..గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 30th January 2019

సెన్సెక్స్‌ 230 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో ప్రారంభం క్రితం రోజు కొన్ని కార్పొరేట్‌ ఫలితాలు ఇన్వెస్టర్లకు పోత్రాహాన్నివ్వడంతో బుధవారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్ల లాభంతో 35,850 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,710 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది నిముషాలకే కొంతవరకూ లాభాల్ని సూచీలు కొల్పోయినా, స్థిరంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం బ్లాక్‌బస్టర్‌ ఫలితాల్ని ప్రకటించిన యాక్సిస్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 30th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు య‌స్ బ్యాంక్‌:- బ్యాంక్ బోర్డులో డైరెక్టర్ ప‌దవికి ప్రమోట‌ర్ గ్రూపులైన రాణా క‌పూర్, మ‌ధు కపూర్ గ్రూప్‌లు ఒక‌రిని చొప్పున  నామినేట్ చేశాయి. బోర్డు ఇందుకు ఆమోదం తెలిపి, ఆర్‌బీఐ అనుమతుల కోసం సిఫార్సు చేసింది. డీసీఎం శ్రీరామ్‌:- బారుచ్ ప్లాంట్‌లో రూ.1070 కోట్ల పెట్టుబ‌డులు పెడుతున్నట్లు ప్రకటించింది. కోర‌మాండ‌ల్‌ ఇంట‌ర్నేష‌న‌ల్‌:- గుజరాత్‌లోని స‌రిగామ్ యూనిట్ గోడౌన్‌లో ప్రమాద‌వ‌శాత్తు అగ్ని ప్రమాదం సంభ‌వించింది. ఈ

Most from this category