News


యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1... అంచనాలు మిస్‌..!

Tuesday 30th July 2019
Markets_main1564485546.png-27419

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికపు అంచనాలను ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంకు అందుకోలేకపోయింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంకు ఈ క్యూ1లో రూ.1,370 కోట్ల నికరలాబాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో కంపెనీ ఆర్జించిన రూ.701 కోట్ల నికరలాభాంతో పోలిస్తే ఇది 95శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం బ్యాంకు ఈ త్రైమాసికంలో రూ.1,850 కోట్ల నికర లాభాన్ని ఆర్జించవచ్చని అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం13శాతం వృద్ధి చెంది రూ.5,844కోట్లను సాధించింది. గతేడాది క్యూ1లో ఎన్‌ఐఐ రూ.5,167కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్లు 3.4శాతం పెరిగాయి. క్వార్టర్‌ టు క్వార్టర్‌ ప్రాతిపదికన ఇదే క్యూ1 కాలంలో నికర ఎన్‌ఏలు 2.04శాతంగానూ స్థూల ఎన్‌పీఏలు 5.25శాతంగానూ నమోదయ్యాయి. క్యూ1 ఫలితాలు అంచానాలను అందుకోలేకపోవడంతో యాక్సిస్‌ బ్యాంకు షేర్లు నేడు మార్కెట్‌ ముగిసే సరికి 2.50శాతం నష్టంతో రూ.702.40ల వద్ద స్థిరపడ్డాయి.



You may be interested

తొందరొద్దు.. చేతిలో కొంత నగదు ఉంచుకోండి: దీపక్‌ షెనాయ్‌

Tuesday 30th July 2019

మార్కెట్లకు ఇదే బోటమ్‌ (కనిష్టం)గా భావించి కొనుగోళ్లకు దిగొద్దని క్యాపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌ షెనాయ్‌ సూచించారు. రానున్న నెలల్లో ఇన్వెస్టర్లకు బోలెడన్ని పెట్టుబడుల అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, అప్పుడు కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    చేతిలో నగదు ఉంచుకునేందుకు వెనుకాడవద్దని, అలాగే, పోర్ట్‌ఫోలియోలో కొన్ని స్టాక్స్‌ను విక్రయించి నగదు నిల్వలతో ఉండడం మంచిదేనని దీపక్‌ షెనాయ్‌ సూచించారు. ఆందోళనతో జరుగుతున్న

వాణిజ్యవేత్తగా విఫలమయ్యా: కేఫ్‌ కాఫీడే అధిపతి

Tuesday 30th July 2019

గత రాత్రి నుంచి కన్పించకుండాపోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ రెండు రోజుల క్రితం రాసిన లేఖ ఒకటి బయపడింది. ఈ లేఖ సారాంశం   ‘మా డైరెక్టర్ల బోర్డుకు, కాఫీ డే కుటుంబానికి, నేను పెద్ద వాటాదారునిగా ఉన్న టెక్నాలజీ కంపెనీలో 37 ఏళ్ల బలమైన నిబద్ధతతో  30,000 ఉద్యోగాలను సృష్టించాను. ఉత్తమ ప్రయత్నాలు చేసినప్పటికి సరైన లాభదాయకమైన వ్యాపార నమూనాను రూపొందించడంలో విఫలమయ్యాను. నాపై నమ్మకం ఉంచిన ప్రజలందరినీ

Most from this category