News


మార్చి 12 నుంచి ఏవియేషన్‌ షో

Wednesday 25th December 2019
news_main1577246122.png-30423

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రెండేళ్లకోసారి జరిగే ఏవియేషన్‌ షో ‘వింగ్స్‌ ఇండియా’ మార్చి 12 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో  నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం జరుగనుంది. ఫ్లైయింగ్‌ ఫర్‌ ఆల్‌ అన్న నినాదంతో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ దీనిని నిర్వహిస్తున్నాయి. 5,000లకుపైగా చదరపు మీటర్ల విస్తీర్ణంలో 150 పైచిలుకు సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఇక్కడ ప్రదర్శించనున్నాయి. బోయింగ్‌, ఎమిరేట్స్‌, డస్సాల్ట్‌, అగస్టా వెస్ట్‌ల్యాండ్‌, ఎంబ్రార్‌, గల్ఫ్‌స్ట్రీమ్‌, క్లబ్‌ వన్‌ ఎయిర్‌, పవన్‌ హన్స్‌ తమ విమానాలతో కనువిందు చేయనున్నాయి. 25కుపైగా విమానాలు, హెలికాప్టర్లు కొలువుదీరనున్నాయి. వైమానిక విన్యాసాల కోసం యూకే నుంచి ప్రత్యేక బృందం రానుందని ఫిక్కీ అధికారి ఒకరు సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి తెలిపారు. మార్చి 11న సాయంత్రం గ్లోబల్‌ సీఈవోల ఫోరమ్‌ సదస్సు జరుగనుంది. మార్చి 12, 13న బిజినెస్‌ విజిటర్లకు కేటాయించారు. వీరికి చార్జీ రూ.2,500 ఉంది. అలాగే 14, 15న సాధారణ ప్రజానీకానికి అనుమతినిస్తారు. ఒక్కో టికెట్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 



You may be interested

యూఎస్‌ మార్కెట్లు ఫ్లాట్‌

Wednesday 25th December 2019

రికార్డుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌ మిశ్రమంగా ముగిసిన ఇండియన్‌ ఏడీఆర్‌లు క్రిస్మస్‌ సెలవులు ప్రారంభంకానున్న నేపథ్యంలో అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మందగించాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్న మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ముగిశాయి. డోజోన్స్‌ 36 పాయింట్లు(0.13 శాతం) క్షీణించి 28,515 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌ నామమాత్ర నష్టంతో 3223 వద్ద స్థిరపడింది. అయితే నాస్‌డాక్‌ 7 పాయింట్లు బలపడి 8953 వద్ద ముగిసింది.

ఐబీసీ చట్ట సవరణల ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ అనుమతి

Wednesday 25th December 2019

న్యూఢిల్లీ: దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌(ఐబీసీ)లో మరికొన్ని సవరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. ఈ మార్పులతో.. దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభానికి ముందుగా కార్పొరేట్‌ రుణగ్రస్తులు ఏవైనా నేరాలకు పాల్పడి ఉంటే.. ఆయా కంపెనీలను కొనుగోలు చేసే నూతన ప్రమోటర్లపై అందుకు సంబంధించి ఎటువంటి బాధ్యత ఉండదు. అలాగే కార్పొరేట్‌

Most from this category