News


విమానయాన రంగానికి రూ.3,797 కోట్లు

Sunday 2nd February 2020
news_main1580614223.png-31416

న్యూఢిల్లీ : 
పౌర విమానయాన రంగానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.3,797 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌ కంటే ఇది 2.62శాతం అధికం. 2019–20 ఆర్థిక సంవత్సరంలో  ఈ రంగానికి రూ.3,700 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి, రాష్ట్ర్రపతి, ఉప రాష్ట్రపతి ప్రయాణాల కోసం  రెండు బి777 విమానాలను కొనుగోలు చేయడానికి రూ.810 కోట్లు  కేటాయించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఇది రూ.272 కోట్లు ఎక్కువ.  ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడులు ఎయిర్‌ ఇండియా వన్‌ అని పిలిచే బి747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భారత్‌లో వివిధ ప్రాంతాల మధ్య విమానాల కనెక్టివిటీని పెంచే ఉదాన్‌ పథకం కోసం రూ.465 కోట్లు కేటాయించారు.   ఎయిర్‌ ఇండియా పునరుద్ధరణ ప్రణాళికను రచించడానికి కేవలం లక్ష రూపాయలు కేటాయించారు. ఇక అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్‌ ఇండియాను ఆర్థికంగా గాడిలో పెట్టడానికి రూ.2,205 కోట్లు కేటాయించారు. 



You may be interested

కొందిరికి మోదం .. కొందరికి ఖేదం

Sunday 2nd February 2020

మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే పదకొండేళ్ల కనిష్టానికి పడిపోయిన దేశ ఆర్ధిక వృద్ధిని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంది. తాజా బడ్జెట్‌తో మళ్లీ ఒకప్పటి ఆర్థిక పరిపుష్టత సాధనపై కేంద్రం దృష్టి పెట్టిందనే అభిప్రాయం కలుగుతోంది. ఆదాయాలు, కొనుగోలు శక్తి పెంపుదలే ప్రస్తుత బడ్జెట్‌ లక్ష్యమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం

మోదీ.. అర్జునుడేనా..?

Sunday 2nd February 2020

ఆర్థిక భారతం.. ఓ పద్మవ్యూహం దారుణంగా పడిపోయిన వృద్ధిరేటు.. నన్నెలా ఛేదిస్తారో చూస్తానంటూ సైంధవుడిలా సవాలు విసురుతోంది!!. ఎన్ని చర్యలు తీసుకున్నా దారికి రాని మందగమనం.. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ లాంటి కురువీరులను గుర్తుకుతెస్తోంది. ఎంత ప్రయత్నించినా కట్టడికాని ద్రవ్యలోటు... ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడి వంటి చక్రవ్యూహ సూత్రధారుల్ని  స్ఫురణకు తెస్తోంది. వెరసి.. అభేద్యమైన పద్మవ్యూహం లాంటి బంధంలో భారత ఆర్థిక వ్యవస్థ ఇరుక్కు పోయింది. 5 శాతానికి పతనమైన

Most from this category