News


టాప్‌ బిలియనీర్ల జాబితాలోకి అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత

Tuesday 11th February 2020
Markets_main1581415844.png-31696

భారత్‌లో టాప్‌-10 బిలియనర్స్‌ జాబితాలో అవెన్యూ సూపర్‌ మార్ట్‌ అధినేత రాధాకృష్ణన్‌ ధమానీ చోటు దక్కించుకున్నారు. గతవారంలో ఫిబ్రవరి5న కంపెనీ క్యూఐపీ ఇష్యూను ప్రకటించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.2,049 వద్ద మొత్తం రూ.4వేల కోట్లను సమీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్రకటన నేపథ్యంలో సోమవారం షేరు 8.5శాతం పెరిగి రూ.2,484.15 వద్ద ముగిసింది. తద్వారా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లేలను అధిగమించి బీఎస్ఈ కంపెనీల్లో 18వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. లిస్టింగ్‌ తేది మార్చి 31నాటి నుంచి సోమవారం ముగింపు నాటికి  షేరు మొత్తం 290శాతం పెరిగింది.  ఈ ఏడాదిలో కంపెనీ మొత్తంగా 35శాతం ర్యాలీ చేసింది. ఒకవేళ లిస్ట్‌లో ఒక ఇన్వెస్టర్‌ రూ.1లక్షల విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లైతే.. సోమవారం ముగింపు సమయానికి సదరు ఇన్వెస్టర్‌ మొత్తం రూ.8.31లక్షలను చేరుకునేది.

టాప్‌-10 బిలియనర్లలో జాబితాలోకి రాధాకృష్ణ ధమాని
షేరు భారీగా ర్యాలీ చేస్తున్న క్రమంలో కంపెనీ అధిపతి రాధాకృష్ణ ధమాని భారత్‌ టాప్‌-10 బిలియనర్లలో జాబితాలో చోటు దక్కించుకున్నారు. సోమవారం షేరు ధర రూ.2484.15 వద్ద ముగిసిన నేపథ్యంలో అతని నెట్‌వర్త్‌ విలువ రూ.84వేల కోట్లకు ఎగసింది. దీంతో భారత్‌ టాప్‌-10 బిలియనర్లలో ఆరోస్థానాన్ని దక్కించుకున్నారు. తర్వాతి స్థానాల్లో గౌతం అదానీ(10.8బిలియన్‌ డాలర్లు), సునీల్‌ మిట్టల్‌(9.6బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. 

భారత్‌లో టాప్‌-10 బిలియనర్స్‌ వీరే...!
క్రమసంఖ్య   పేరు  నికర విలువ(బిలియన్‌ డాలర్లలో)
1 ముకేశ్‌ అంబానీ 55.4
2 అజీమ్‌ ప్రేమ్‌జీ 18.2
3 శివ్‌ నాడార్‌ 16.6
4 ఉదయ్‌ కోటక్‌ 14.5
5 లక్ష్మీ మిటల్‌ 13.2
6 రాధాకృష్ణ ధమాని 11.9
7  గౌతమ్‌ అదానీ 10.8
8 సునిల్‌ మిట్టల్‌ 9.6
9 సైరస్‌ పూనవాలా  9.2
10 వేణు బంగూర్‌ 8.2

 



You may be interested

సెన్సెక్స్‌ బౌన్స్‌బ్యాక్‌

Tuesday 11th February 2020

లాభాల డబుల్‌ సెంచరీ 41,000 ఎగువన ముగింపు ఇంట్రాడేలో క్వాడ్రపుల్‌ విదేశీ సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 237 పాయింట్లు ఎగసి 41,216 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 12,108 వద్ద స్థిరపడింది. వెరసి రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. కరోనా భయాలను వీడిన అమెరికా మార్కెట్లు సోమవారం సరికొత్త గరిష్టాలను సాధించడంతో దేశీయంగానూ మార్కెట్లు జోరందుకున్నాయి. ట్రేడింగ్‌

డీమార్ట్‌, నెస్లే.. తగ్గితే కొనొచ్చు?!

Tuesday 11th February 2020

సిగరెట్ల బిజినెస్‌ విడదీస్తే.. ఐటీసీ భేష్‌  స్టీల్‌ కంపెనీలపట్ల ఆసక్తి లేదు - దేవంగ్‌ మెహతా, ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌, సెంట్రమ్‌ ఇండియా ప్రపంచ మార్కెట్లు సరికొత్త రికార్డులను చేరుతుండటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొస్తున్నట్లు సెంట్రమ్‌ ఇండియా ఈక్విటీ అడ్వయిజరీ హెడ్‌ దేవంగ్‌ మెహతా పేర్కొంటున్నారు. బడ్జెట్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు)కు సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో లార్జ్‌ క్యాప్స్‌తోపాటు.. మిడ్‌ క్యాప్‌ కౌంటర్లూ లాభపడనున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ముడిచమురు ధరలు తగ్గితే పలు

Most from this category