News


అవెన్యూ సూపర్‌మార్ట్‌ క్యూ1 నికర లాభం రూ.323 కోట్లు

Saturday 13th July 2019
news_main1563015851.png-27046

  • నూతనంగా 8 స్టోర్లను ఆవిష్కరణ

డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్‌లెట్లను నడుపుతున్న అవెన్యూ సూపర్‌మార్ట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.323 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో ఆర్జించిన రూ.245 కోట్ల నికరలాభంతో పోలిస్తే ఇది 32శాతం అధికం. కన్సాలిడేషన్‌ ప్రాతిపదికన ఈ క్యూ1లో కంపెనీ ఆదాయం 27శాతం వృద్ధి చెంది రూ.5,815 కోట్లను సాధించింది. గతేడాది క్యూ1 కాలానికి కంపెనీ ఆదాయం రూ.4,576 కోట్లుగా నమోదైంది. ఎబిటా రూ.529 కోట్లను సాధించగా, ఎబిటా మార్జిన్లు 9.2శాతం నుంచి 10.3శాతానికి ఎగిశాయి. అలాగే ఈ క్యూ1లో 8 నూతన స్టోర్లను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపంది. రెవెన్యూ వృద్ధి అంచనాలకు అనుగుణంగానే నమోదైంది. గ్రాస్‌ మార్జిన్లు స్వల్పంగా తగ్గాయి. మెరుగైన పనితీరు పీఏటీ మార్జిన్లు పెరగడానికి దోహదపడ్డాయి. గతంలో చెప్పినట్లుగా, క్యూ1 మార్జిన్లు మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని ప్రభావితం చేయలేవు అని కంపెనీ సీఈవో, ఎండీ నెవిల్లే నోరోన్హా తెలిపారు.



You may be interested

వీఐఎక్స్‌ అలా... మార్కెట్‌ ఇలా...!

Saturday 13th July 2019

మార్కెట్లు బడ్జెట్‌ తర్వాత ఒక్కమారుగా తిరోగమనం బాటపట్టాయి. నిఫ్టీ 11500 పాయింట్ల వరకు పతనమైంది. దీంతో గత కొన్ని నెలల రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపినట్లయింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20 రోజుల డీఎంఏకు దిగువన ఉంది. ఇదే సమయంలో దేశీయ మార్కెట్‌ కదలికలను ప్రతిబింబించే వీఐఎక్స్‌ సైతం పలు నెలల కనిష్ఠానికి దిగజారడం గమనార్హం. ప్రస్తుతం వీఐఎక్స్‌ 12- 13 రేంజ్‌లో కదలాడుతోంది. ఈ విధంగా ఒక పక్క

వారంలో 10-20శాతం నష్టాలను చవిచూసిన 18 షేర్లివే...

Saturday 13th July 2019

మోదీ 2.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించలేకపోయింది. ఫలితంగా బెంచ్‌మార్క్‌ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్‌ ఈ వారంలో 2శాతం క్షీణించాయి. ఈ ఐదు ట్రేడింగ్‌ సెషన్స్‌లో రూ.3.27లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. గతవారం ఆర్థికమంత్రి ప్రతిపాదించిన బడ్జెట్‌లో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ వైపు తీసుకెళ్లడానికి అన్ని అంశాలు ఉన్నాయి. అయితే, సంపన్న వర్గాలపై పన్ను విధించాలనే ప్రతిపాదన, భారత్‌తో ఇన్వెస్ట్‌ చేస్తున్న  2000కు పైగా

Most from this category