News


మార్కెట్లోకి ‘ట్రెండ్‌ ఈ’ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

Saturday 23rd March 2019
news_main1553322813.png-24758

ధరల శ్రేణి రూ.56,900– రూ.81,269

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ అవన్‌ మోటార్స్‌.. ‘ట్రెండ్‌ ఈ’ పేరుతో నూతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. సింగిల్‌ బ్యాటరీ కలిగిన స్కూటర్‌ ధర రూ.56,900 కాగా, డబుల్‌ బ్యాటరీ స్కూటర్‌ ధర రూ.81,269. రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తిగా చార్జయ్యే విధమైన లిథియం-అయాన్ బ్యాటరీని ఈ స్కూటర్లలో అమర్చినట్లు తెలిపింది. సింగిల్‌ బ్యాటరీ స్కూటర్‌ గంటలకు 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, డబుల్‌ బ్యాటరీ స్కూటర్‌ 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదని సంస్థ ప్రకటించింది. రూ.1,100 చెల్లించి స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్‌ హెడ్ పంకజ్ తివారీ మాట్లాడుతూ.. ‘ప్రీ-బుకింగ్స్‌ సమయంలో ఈ స్కూటర్స్‌కు విశేష స్పందన మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ స్కూటర్‌ ఫీచర్లు కస్టమర్లకు బాగా నచ్చుతాయని భావిస్తున్నాం’ అని అన్నారు.



You may be interested

టాప్‌ స్పీడుమీదున్న ‘ఆల్టో’

Saturday 23rd March 2019

- ఫిబ్రవరిలో బెస్ట్‌ సెల్లింగ్‌ పీవీ ఇదే న్యూఢిల్లీ: మారుతి సుజుకి ‘ఆల్టో’ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెస్ట్‌ సెల్లింగ్‌ ప్యాసింజర్‌ వాహనం(పీవీ)గా ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌(సియామ్‌)విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 24,751 యూనిట్ల ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదేకాలంలో కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా నిలవగా.. ఈసారి ఆస్థానానికి ఆల్టో దూసుకొచ్చింది.

రిటైల్ ఇం'ధనం'పై దిగ్గజాల దృష్టి

Saturday 23rd March 2019

- భారత్ మార్కెట్‌పై విదేశీ సంస్థల ఆసక్తి - పెద్ద సంఖ్యలో రిటైల్‌ ఔట్‌లెట్స్‌ ఏర్పాటుపై కసరత్తు - ఆదానీ గ్రూప్‌తో ఫ్రాన్స్‌ టోటల్‌ జట్టు - ఎస్సార్‌ ఆయిల్‌ను కొనుగోలు చేసిన రాస్‌నెఫ్ట్‌ - 3,500 ఔట్‌లెట్స్‌ ఏర్పాటుకు బీపీకి లైసెన్సులు           దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ దిగ్గజ ఆయిల్‌ కంపెనీలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. ఇంధన రిటైలింగ్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పోటీపడుతున్నాయి. ఫ్రాన్స్‌కి చెందిన టోటల్‌ ఎస్‌ఏ

Most from this category